Wednesday, August 5, 2026 06:38 AM
Wednesday, August 5, 2026 06:38 AM

బ్రేకింగ్: లావు భద్రతపై సర్కార్ అలెర్ట్

దేశవ్యాప్తంగా ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారం సంచలనంగా మారింది. పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల తర్వాత జాతీయ మీడియా కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. ఏపీ లిక్కర్ స్కాంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని.. ఆయన పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆయనను పిలిచి వివరణ కూడా అడిగారు. దీనితో లిక్కర్ స్కాంపై ఖచ్చితంగా ఈడీ విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Also Read : బీజేపీకి విజయసాయి రెడ్డి ఆఫర్ వెనుక కారణం ఇదేనా..?

ముఖ్యంగా మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ డి కొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సమయంలో లావు కృష్ణదేవరాయలు భద్రతపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కృష్ణదేవరాయులకు భద్రత పెంచేదిగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి ఓ నివేదికను అందించాయి.

Also Read : వైసీపీకి గ్రోక్ షాక్.. ఏం చెప్పిందంటే..

వైసీపీ శ్రేణులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందని.. కాబట్టి ఆయనకు భద్రత పెంచాలని నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే ఢిల్లీలో కూడా ఆయనకు భద్రత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా నిఘా విభాగం.. ఓ నివేదిక పంపినట్లు వార్తలు వస్తున్నాయి. లావు కృష్ణదేవరాయలు ఇంటి వద్ద కూడా భద్రతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల మేరకు ఆయన పర్యటనలు, పార్టీ పరమైన సమావేశాలతో పాటుగా ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యే కార్యక్రమాలకు కూడా భద్రత పెంచనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్