Sunday, September 20, 2026 01:47 AM
Sunday, September 20, 2026 01:47 AM

బాలీవుడ్ గోల్డెన్ లెగ్ రష్మిక

నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన.. ఇప్పుడు బాలీవుడ్ లో దుమ్మురేపుతోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు లేకపోవడంతో ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు రష్మిక ఎక్కువగానే కష్టపడుతోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన రష్మిక మందన… ఇప్పుడు వరుస విజయాలతో అక్కడ దూసుకుపోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమె నటించిన సినిమా ప్రతి ఒక్కటీ హిట్ అవుతుంది. లేటెస్ట్ గా వచ్చిన పుష్పా సిక్వెల్ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏకంగా రెండు వేల కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ క్రిస్టియన్ వెడ్డింగ్ ఫొటోస్

ఇక యానిమల్ సినిమాతో రష్మిక 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఇక లేటెస్ట్ గా ఛావా సినిమాతో కూడా ఆమె దుమ్మురేపింది. ఆ సినిమాలో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అయితే రష్మిక కెరియర్ లో యానిమల్, ఛావా సినిమాలు స్పెషల్ అనే చెప్పాలి. బాలీవుడ్ ఇబ్బంది పడుతున్న టైంలో వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. దీనితో ఇప్పుడు బాలీవుడ్ జనాలు రష్మికను గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Also Read : బాలీవుడ్ ను బతికించిన ఛావా…?

సావిత్రి, శ్రీదేవి, జయలలిత తర్వాత ఎక్కువగా బాలీవుడ్ లో ప్రభావం చూపిస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక మందనానే కావడం చూసి సౌత్ ఇండియా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్లను బాలీవుడ్ డైరెక్టర్లు దగ్గరకు రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారడంతో మన స్టార్ హీరోయిన్లు దిక్కయ్యారు. ఇక రష్మిక మందన ఇటు తెలుగులో కూడా బిజీగానే ఉంది. వరుస ప్రాజెక్టులతో ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు కష్టపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్