Wednesday, February 4, 2026 04:09 PM
Wednesday, February 4, 2026 04:09 PM

వైసీపీ నేతలకు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా..?

ఏపీలో వైసీపీ నేతలు తమ తీరుతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 2091-24 మధ్య కాలంలో ఏం చేశారు అంటే.. జిల్లాల విభజన అనే అంశం మాత్రమే గుర్తుకు వస్తుంది. అంతకు మించి వైసీపీ సర్కార్ ఏపీలో చేసింది ఏమీ లేదనేది బహిరంగ రహస్యం. చంద్రబాబు క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన.. ఐదేళ్లు అదే తీరున కొనసాగింది. ఎదురు తిరిగిన వారిపై దాడులు, కేసులు, హత్యలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వలంటీర్ వ్యవస్థ ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీ మినహా కొత్తగా చేపట్టిన పనులు శూన్యమే. రాజధాని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం.. సంక్షేమ పథకాల అమలుకు బటన్ నొక్కడం మినహా.. అభివృద్ధి అనే మాటే ఎత్తలేదు. ఇక ఐదేళ్ల వైసీపీ పదవీ కాలంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన అంటే.. పరదాలకే పరిమితం అయ్యారు.

Also read : బాబు గారు.. ఆ మాట మర్చిపోయారా..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల సంఖ్యను 26 జిల్లాలకు పెంచారు. అయితే అప్పటికే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, వ్యతిరేకతలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మార్కాపురం, మదనపల్లె జిల్లా ఏర్పాటుతో పాటు కొన్ని రెవెన్యూ, మండల కేంద్రాలను అప్పటికే ఉన్న జిల్లాల నుంచి వేరు చేసి మరో జిల్లాలోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. అయితే ఇవేవీ నాటి వైసీపీ పెద్దలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. పైగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. అందరి మేలు కోసమే తీసుకున్నారని గొప్పగా చెప్పారు కూడా. పైగా.. జగన్ తీసుకున్న నిర్ణయ ఫలితం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాలంటూ సూచనలు కూడా చేశారు.

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న డిమాండ్‌లు ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడు దీనిపై కొత్త రాగం పాడుతున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలప్పుడు జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా గొప్పగా ప్రకటించారు. జిల్లాల విభజనలో మళ్లీ ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశంలోనే కొనసాగించారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా సరే.. వైసీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. గిద్దలూరు రెవెన్యూ డివిజన్ చేయాలని.. దొనకొండ, కురిచేడు మండలాలను కూడా మార్కాపురం జిల్లాలో కలపాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. పైగా ఆందోళన చేస్తామంటూ బెదిరిస్తున్నారు కూడా.

Also read : అమెరికాలో గన్ కల్చర్ ఎప్పుడు మొదలైంది..? అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి..?

ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నేతల తీరుపై కూడా ఆ జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా ఉన్న గూడూరు డివిజన్‌ను వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి జిల్లాలో కలిపేశారు. అప్పట్లో ఇదో చారిత్రాత్మక నిర్ణయమని.. పరిపాలన ఇంక సులభం అవుతుందంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు మాత్రం.. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చకపోతే.. ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే.. మరో అడుగు ముందుకు వేశారు. గూడూరు డివిజన్‌ను నెల్లూరులో కలపకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ మాట ఎందుకు అనలేదని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఎదిరించలేదంటున్నారు. అప్పుడు జగన్‌కు ఎదురు చెబితే.. బాత్రూమ్‌లో గుండె పోటు వస్తుందని భయపడ్డారా.. అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే.. వైసీపీ ఓటమికి ఆ పార్టీ నేతలే కారణమంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్