Thursday, September 10, 2026 06:02 PM
Thursday, September 10, 2026 06:02 PM

వైసీపీ నుంచి సజ్జల అవుట్..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ సమీకరణానికి తెరలేస్తోందా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2029 ఎన్నికలకు సన్నద్ధం చేసే క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారా..? పార్టీ వ్యూహ రచనలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేశారా..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వైసీపీలో గందరగోళం సృష్టిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి దక్కించుకున్న సజ్జల.. నాటి ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ శాఖ పనితీరు అయినా సరే.. ఏ శాఖ పైన ఆరోపణలైనా సరే.. ఏ విభాగం ఉద్యోగులతో అయినా సరే.. ఆయనే సమీక్షలు, వివరణలు చేశారు.

Also Read : ఎన్నారైల అండతో తెలుగుదేశం జెండా రెపరెపలు

అయితే వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు టార్గెట్ సజ్జల అన్నట్లుగా విమర్శలు చేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ముద్ర పడిన మాజీ ఎంపీ, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లే వైసీపీ ఓడిపోయినట్లు ఆరోపించారు. జగన్ చుట్టూ ఓ కోటరి ఉందని.. వారిని పక్కన పెట్టకపోతే.. వైసీపీ గెలుపు కష్టమే అని కీలక వాఖ్యలు చేశారు కూడా. దీంతో సజ్జలను తొలగించాలనే డిమాండ్ కూడా పార్టీలో భారీగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జలను తప్పించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

సజ్జల స్థానంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ వ్యూహాలు రచించడంలో తనదైన ముద్ర వేసుకున్న ధర్మాన ప్రసాదరావును పార్టీ పునర్నిర్మాణంలో కీలకంగా ఉపయోగించుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేడర్‌ను తిరిగి సమీకరించడం, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేయడం, ప్రత్యర్థి పార్టీల రాజకీయ వ్యూహాలకు దీటుగా వ్యూహాలు రూపొందించడం వంటి అంశాల్లో ధర్మానకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు పార్టీ అంతర్గత మీటింగ్‍లో వినిపిస్తోంది.

Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో సంచలనం..!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ధర్మాన ప్రసాదరావుతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీకి పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తూ విజయవాడ కేంద్రంగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు కేడర్‌ను బలోపేతం చేసే వ్యూహాలను రూపొందించాల్సిందిగా సూచించినట్టు సమాచారం. అయితే దీనిపై వైసీపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ సమన్వయం, రాజకీయ వ్యూహాల్లో ఆయనే కీలకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి సజ్జలను పూర్తిగా పక్కన పెడతారా.. లేక పార్టీ బాధ్యతల్లో మార్పులు చేస్తారా.. అనేది తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘సర్దార్ 2’ మూవీ...

తమిళ హీరో కార్తీ కెరీర్‌లోని ఉత్తమ...

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు...

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం...

చిన్న శ్రీను షాక్‌…...

విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా భావోద్వేగాల...

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లేడీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా...

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో...

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన...

ఎన్నారైల అండతో తెలుగుదేశం...

2029 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాల్సిన...

పోల్స్