Sunday, June 21, 2026 02:14 AM
Sunday, June 21, 2026 02:14 AM

షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

భారత క్రికెట్ లో రిటైర్మెంట్ ల పర్వం కొనసాగుతోంది. టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు ఒక్కొక్కరు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా.. రవిచంద్రన్ అశ్విన్.. గుడ్ బై చెప్పగా ఇటీవల రోహిత్ శర్మ తప్పుకున్నాడు. తాజాగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కు గుడ్ చెప్పేసాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కోహ్లీ. రెండు రోజుల నుంచి కోహ్లీ తప్పుకుంటాడు అనే ప్రచారం జరుగుతోంది. బోర్డు పెద్దలకు రెండు రోజుల క్రితమే ఈ విషయం చెప్పాడు కోహ్లీ.

Also Read : తర్వాతి కెప్టెన్ ఎవరు..? ఆ ముగ్గురికే ఛాన్స్

దీనితో బోర్డు పెద్దలు కోహ్లీ రిటైర్ కాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. ఓ ప్రముఖ మాజీ క్రికెటర్ కోహ్లీని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా ఆగలేదు. 14 ఏళ్ళ క్రితం తాను టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాను అని.. అప్పటి నుంచి టెస్ట్ క్రికెట్ తనకు ఎంతో నేర్పిందని అన్నాడు కోహ్లీ. ధోనీ తప్పుకున్న తర్వాత కోహ్లీని కెప్టెన్ ను చేసారు. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. వచ్చే వారం ఇంగ్లాండ్ పర్యటనకు జట్టు ఎంపిక ఉన్న తరుణంలో కోహ్లీ నిర్ణయం ఆశ్చర్య పరిచింది.

Also Read : కోహ్లీ సంచలన నిర్ణయం.. వద్దంటున్న బోర్డ్

123 టెస్టుల్లో, కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు, వాటిలో 30 సెంచరీలు మరియు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 254. 2011లో ఇండియా తరుపున టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు కోహ్లీ. ఆ తర్వాత 2014 ఆస్ట్రేలియా పర్యటన నుంచి కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో విశ్వరూపం చూపించాడు. అయితే గత రెండేళ్ళు గా కోహ్లీలో మునుపటి ఆట తీరు కనపడలేదు. దీనితో తప్పుకోవాలనే డిమాండ్ లు వచ్చాయి. మరి వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడతాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్