టాలీవుడ్‌లో ప్రముఖ నటులు రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితంపై గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా మరియు వినోద రంగంలో విస్తృత చర్చ కొనసాగుతోంది. ఈ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని, గత దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు తరచూ ప్రచారంలోకి వచ్చాయి. వీరు కలిసి కనిపించే ప్రతి సందర్భంలో అభిమానులు మరియు మీడియా వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.
Also Read : భారత్‌కు శివరాత్రి.. పాకిస్తాన్‌కు కాళరాత్రి..!
మధ్యలో వీరిద్దరూ విడిపోయారని కూడా కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. కొందరు సినీ విశ్లేషకులు విజయ్ దేవరకొండ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పేర్కొనగా, మరికొందరు వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఇటీవల ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు మళ్లీ ప్రాచుర్యం పొందాయి.
గత సంవత్సరం నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతుండగా, ఈ నెల 26న వారి వివాహం జరగనున్నట్లు సోషల్ మీడియాలో ఒక శుభలేఖ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించబడుతుందని సమాచారం. అలాగే, మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు వీరితో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు మరియు వారి కెరీర్‌కు మద్దతు ఇచ్చిన వ్యక్తులను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకులు సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, నటులు రణబీర్ కపూర్, అల్లు అర్జున్, దర్శకుడు తరుణ్ భాస్కర్ తదితరులకు ఆహ్వానం అందవచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read : పాక్ ఆర్మీకి బలూచ్ చుక్కలు.. అసలేం జరిగింది..?
వీరి వివాహ కార్యక్రమాన్ని లైవ్ కవర్ చేయడానికి/ప్రసారం చేయడానికి ఒక ప్రముఖ ఓటిటి నుంచి భారీ మొత్తంలో వచ్చిన ఆఫర్ ని కూడా వీరు తిరస్కరించినట్లు తెలుస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఏ స్థాయిలో ప్రచారం జరుగుతున్నా.. ఈ మొత్తం విషయంపై సంబంధిత వ్యక్తులు లేదా వారి ప్రతినిధుల నుంచి అధికారిక ప్రకటన లేకపోవడం కొసమెరుపు.

