Wednesday, October 7, 2026 02:30 AM
Wednesday, October 7, 2026 02:30 AM

పాక్ ఆర్మీకి బలూచ్ చుక్కలు.. అసలేం జరిగింది..?

తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఇప్పుడు ఓ సంచలన అడుగు వేసింది. ఏకంగా పాక్ సైనికులను బందీలుగా తీసుకున్నారు బలూచ్ ఉగ్రవాదులు. పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన ఏడుగురు సభ్యులను నిర్బంధంలో ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాక్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఆ సమయంలో చర్చలు జరగకపోతే ఖైదీలకు ఉరిశిక్ష విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

గడువు ముగియడానికి ఆరు రోజులు మిగిలి ఉన్నాయని బలూచ్ ఆర్మీ హెచ్చరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే దీనిపై పాకిస్తాన్ సైన్యం లేదా ప్రభుత్వ అధికారుల నుండి ఇంకా స్పందన లేకపోవడం గమనార్హం. “ఆపరేషన్ హెరోఫ్ 2.o” లో భాగంగా ఈ చర్యలకు దిగింది బలూచ్ ఆర్మీ. ఈ ఆపరేషన్ సమయంలో వివిధ రంగాలలో పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన మొత్తం 17 మంది సిబ్బందిని తమ యోధులు అదుపులోకి తీసుకున్నారని బలూచ్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

అదుపులోకి తీసుకున్న వారిలో పది మందిని బలూచ్‌ జాతి వారిగా గుర్తించి, స్థానిక పోలీసులతో సంబంధం కలిగి ఉన్నందున హెచ్చరించి విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. మిగిలిన ఏడుగురు ఖైదీలు పాకిస్తాన్ సైన్యంలోని సాధారణ విభాగాలకు చెందినవారని.. బలూచ్ నేషనల్ కోర్ట్ లో వారికి శిక్ష పడుతుందని తెలిపింది. తమ జాతిపై హత్యాకాండ కొనసాగుతుందని, ఇది బలూచ్ ఆర్మీ సహించేది లేదని పాకిస్తాన్ సర్కార్ ను హెచ్చరించింది. గతంలో కూడా వారు ఇలాగే హెచ్చరించినా పాక్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్