Friday, October 9, 2026 02:36 AM
Friday, October 9, 2026 02:36 AM

బాబుకి తలనొప్పిగా మారుతున్న ఎమ్మెల్యేలు.. చర్యలెక్కడ?

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి టిడిపి అధినేత చంద్రబాబు కి తలనొప్పిగా మారింది. కొంతకాలంగా నాయకుల క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్న విధానంతో ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు, పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరుడిని కాంట్రాక్టు ఉద్యోగంలో నియమించేందుకు సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగించింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి గంభీరంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

Also Read : అమరావతి అంటే జగన్ కి కంపరం.. బాబు కీలక వ్యాఖ్యలు

ఈ వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన స్పందించకుండా వివాదానికి దారి తీసినట్లు నివేదికలు అందినట్లు చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఎమ్మెల్యే ప్రవర్తించారని భావిస్తున్న పార్టీ అధిష్టానం, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిన్న ఉద్యోగ నియామక అంశంపై ఇంతగా వివాదం సృష్టించడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగడం, ఐజీ స్థాయి అధికారి వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

Also Read : అంచనాలు పెంచిన ‘రామాయణ’ టీజర్ బడ్జెట్ వింటే షాక్..!

ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం స్పందిస్తూ, నియంత్రణ లోపం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజాప్రతినిధులు తమ ప్రవర్తనలో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనను ఉద్దేశించివేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్