టి20 వరల్డ్ కప్ లో చిన్న జట్లు ఏ ముహూర్తంలో అడుగు పెట్టాయో గాని.. ప్రతీ జట్టు కూడా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్.. టి20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోయింది. అహ్మదాబాద్ లో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో సఫారీలు గెలిచినా.. ఆఫ్ఘన్ దమ్ము ఏంటో క్రికెట్ ప్రపంచానికి క్లారిటీ వచ్చింది. ఈ మ్యాచ్ లో ఏకంగా రెండు సూపర్ ఓవర్ లు జరగడం ఓ సంచలనమే అయింది .
Also Read : మీకు దండం.. భారత్ తో ఆడండి.. బంగ్లాదేశ్ షాకింగ్ రిక్వెస్ట్..!
గ్రూప్ డీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్ల తర్వాత సఫారి జట్టు విజయం నమోదు చేసినా.. ఆఫ్ఘన్ మాత్రం తన దమ్ము ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు.. ర్యాన్ రికెల్టన్ (61), క్వింటన్ డి కాక్ (59) అర్ధ సెంచరీలతో రాణించడంతో 20 ఓవర్లలో మొత్తం ఆరు వికెట్ల నష్టానికి 187పరుగులు చేయగా..ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆఫ్ఘన్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. రహ్మానుల్లా గుర్బాజ్ 84 పరుగులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపించింది.
Also Read : రంగంలోకి బన్నీ.. ఇక లీగల్ ఫైట్
19.5 ఓవర్లలో 187 పరుగులకు ఆఫ్ఘన్ ఆల్ అవుట్ కాగా.. చివరి ఓవర్ లో కగిసో రబాడ రెండు నో-బాల్స్ వేయడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి ఆఫ్ఘన్ ను దెబ్బ కొట్టిన ప్రోటీస్ బౌలర్ లుంగి ఎన్గిడి, మొదటి సూపర్ ఓవర్ బౌలింగ్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక సఫారి జట్టు సూపర్ ఓవర్ ను డ్రా చేయడంతో మరో ఓవర్ జరిగింది. ఆ తర్వాత స్టబ్స్, డేవిడ్ మిల్లర్.. ఒమర్జాయ్ బౌలింగ్ లో మూడు సిక్సర్లు కొట్టి రెండో సూపర్ ఓవర్ లో 24 పరుగులు చేయగా.. ఇక ఆఫ్ఘన్ జట్టు కూడా అదే స్థాయిలో ఆడింది. చివరి నాలుగు బంతుల్లో గుర్బాజ్ నాలుగు సిక్సర్లు కొట్టాల్సి ఉండగా.. మూడు సిక్సర్లతో దాదాపుగా విజయం దిశగా వెళ్ళాడు. కానీ చివరి బంతికి ఔటవ్వడంతో ఆఫ్ఘన్ ఓటమి పాలైంది.

