Wednesday, August 5, 2026 07:38 AM
Wednesday, August 5, 2026 07:38 AM

బెజవాడ నుంచి అమరావతి వెళ్ళే వారికి గుడ్ న్యూస్..!

సీడ్ యాక్సిస్ రోడ్.. అమరావతి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి.. అంటే గత పదేళ్ళ నుంచి ఎక్కువగా వినపడిన ప్రాజెక్ట్. ఈ రోడ్డు నిర్మాణం కారణంగా అమరావతిలోకి ఎంటర్ అయ్యే వారికి ఎంతో సౌలభ్యంగా ఉన్నప్పటికీ.. 2019 నుంచి 2024 వరకు దీని నిర్మాణం మాత్రం ముందుకు కదలలేదు. పైగా రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో తారుని తవ్వేసి.. తమ ఇళ్ళ వద్ద వర్షం మడుగు కాకుండా ఉండేందుకు వాడుకున్నారు ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు. ప్రభుత్వ ఆస్తి నాశనం అయినా.. అప్పటి అధికారులు స్పందించలేదు.

Also Read : వందేభారత్ స్లీపర్ ముహుర్తం ఫిక్స్.. ఆ రూట్‌లోనే..!

దీని కారణంగా కరకట్టపై వెళ్ళే వారికి ఎంతో ఇబ్బంది. రాత్రి సమయాల్లో ఎంతో ప్రమాదకరం. కేబినేట్ సమావేశాలు, కలెక్టర్ ల సమావేశం, లేదంటే అధికారులు సచివాలయం, అసెంబ్లీ, హైకోర్ట్ కి వెళ్లి, వచ్చే ఉదయ, సాయంత్ర సమయాలు, నిత్యం ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ వాహనాలు, దానికి తోడు సిఎం నివాసం, స్థానిక ప్రజలు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు.. ఇలా కరకట్ట రోడ్డుపై డ్రైవింగ్ అంటే.. ఘాట్ రోడ్డు ప్రయాణం కంటే ప్రమాదంగా మారిన పరిస్థితి. అలాగే కేవలం 60 అడుగులు మాత్రమే ఉండే కరకట్ట రోడ్డు విస్తరణకు కూడా ఎంతో కష్టం.

Also Read : బర్డ్ ఫ్లూ రీ ఎంట్రీ..? కాని అక్కడే..!

ప్రభుత్వానికి అది భారీ వ్యయం కూడా. దాని కంటే సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేపడితే సులభంగా ఉంటుంది. కూటమి సర్కార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టింది. మంత్రి నారాయణ ఆదేశాలతో అధికారులు పరుగులు పెట్టారు. దీనితో మరో 1.5 కి.మీ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం కూడా తగ్గింది. తాజాగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డు, గుంటూరు ఛానెల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించారు. కరకట్టపై వెళ్ళే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్