Wednesday, September 23, 2026 10:06 PM
Wednesday, September 23, 2026 10:06 PM

అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులకు షాక్ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ తో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ షాక్ అయింది. మహిళ మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ… పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నాడని, దీనితో అభిమానులను అదుపు చేయలేకపోయామని పోలీసులు పేర్కొన్నారు.

Also Read : కేటిఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం… గవర్నర్ గ్రీన్ సిగ్నల్…?

ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ పరిణామంతో రాజకీయ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు రేవంత్ రెడ్డి.

Also Read : బ్రేకింగ్: అల్లు అర్జున్ అరెస్ట్… షాక్ లో టాలీవుడ్

ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు అంటూ స్పష్టం చేసారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు రేవంత్. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని… తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని రేవంత్ స్పష్టం చేసారు. ఇక తన ఢిల్లీ పర్యటనలో క్యాబినెట్ విస్తరణ పై చర్చ లేదన్నారు. ఓవైపు సీరియస్ గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని… ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో చర్చలు జరగాలన్నారు రేవంత్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

బ్రేకింగ్: విజయసాయి రెడ్డి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన...

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

పోల్స్