పీఆర్‌సీ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులలో ఎవరిని నియమిస్తారు..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. త్వరలో ప్రభుత్వం నియమించనున్న ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ కమిషనర్‌గా రిటైర్డు ఐఏఎస్ అధికారులలో ఒకరుండవచ్చు అనే ప్రచారం ఇప్పుడు సచివాలయంలో జోరుగా జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. దినేష్ కుమార్, ఎల్పీ సుబ్రహ్మణ్యం, నీరబ్ కుమార్ ప్రసాద్, వసధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, ఎంటీ కృష్ణబాబు, అజయ్ జైన్్ పేర్లు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇదే పోస్టులో నియమించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తారనేది ఉద్యోగుల అభిప్రాయం.
Also Read : టీవీకే టార్గెట్‌లో డీఎంకే కీలక నేతలు.. చుక్కలు చూపిస్తున్న విజయ్..!
ప్రస్తుతం రిటైర్డు ఐఏఎస్ అధికారుల్లో ఒకరో ఇద్దరో తప్ప.. మిగిలిన వారంతా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వీరిలో చంద్రబాబు దృష్ణిలో ఎవరున్నారనేది ఇప్పుడు తెలియటం లేదు. ఆ పేరు ఏదో తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే. అయితే ఇదే సమయంలో కొందరు ఉద్యోగులు, రాజకీయ విశ్లేషకులు మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే లోకేష్ గురించి. మంత్రి నారా లోకేష్ మదిలో మరో అధికారి ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభిమాని అయిన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరును ప్రకటిస్తారా.. అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా, ప్రస్తుత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో హైదరాబాద్‌లో జరిగిన రహస్య సమావేశానికి ఈ పెద్దాయనే సారధ్యం వహించినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సీఎంఓ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజయానంద్ ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను అక్కడ నుంచి తప్పించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజయానంద్‌ను పీఆర్‌సీ కమిషనర్‌గా నియమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
Also Read : సినిమాల్లో మహిళల గ్లామరైజేషన్‌పై తాప్సీ సంచలనం..!
నిజానికి చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నిజాయతీ పరులు, సమర్థులు కూడా. అయితే వీరిలో భార్యభర్తలైన రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధ మిశ్రాలపై చంద్రబాబు స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా జల వనరుల శాఖ కార్యదర్శిగా, వసుధ మిశ్రా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. వీరిద్దరు పరస్పరం సహకరించుకుని కోట్లు వెనకేసుకున్నారని.. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే.. ముందు జాగ్రత్తగా కేంద్ర సర్వీసులకు వెళ్లి అక్కడే రిటైర్డ్ అయ్యారనేది ప్రధాన ఆరోపణ. మరి అప్పుడు నచ్చని ఈ ఇద్దరు భార్యభర్తలు.. ఇప్పుడు ఎలా నచ్చారో ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు. మరో విషయం ఏమిటంటే.. ఖాళీగా వున్న విజిలెన్స్ కమిషనర్ పోస్టులో రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించనున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పటి జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంలో అప్పటి పాలకులకు, సలహాధారునికి పూర్తిగా సహకరించారని అప్పట్లో చంద్రబాబు స్వయంగా విమర్శలు, ఆరోపణలు చేశారు.

