Monday, August 3, 2026 02:52 PM
Monday, August 3, 2026 02:52 PM

పోస్టుల కుదింపుతో కొట్లాటకు చెక్..!

పశు సంవర్ధక శాఖ డైరెక్టర్, కమీషనర్‌గా ఐఏఎస్ అధికారి.. అగ్రికల్చర్ శాఖలో వున్నట్లు ఒకే ఒక డైరెక్టర్, కమీషనర్ పోస్టు లా.. పశు సంవర్ధక శాఖలో కూడా అదే పద్ధతిని అమలు చేయాలనే నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పశుసంవర్ధక శాఖలోని నాలుగు డైరెక్టర్ పోస్టుల్లో మూడు పోస్టులను రద్దు చేసి ఒక డైరెక్టర్ పోస్టుకే పరిమితం చేశారు. ఆ పోస్టును కమీషనర్ స్థాయికి అప్ గ్రేడ్ చేసి ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : అష్టగ్రహ కూటమి వేళ.. యుద్ధ జ్వాలల్లో పశ్చిమాసియా!

ప్రస్తుతం వ్యవసాయశాఖలో డైరెక్టర్, కమీషనర్ పోస్టు ఎలా ఉందో.. అదే విధంగా పశుసంవర్ధక శాఖలో కూడా అదే విధమైన పద్ధతి ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. పశుసంవర్ధక శాఖలో నాలుగు డైరెక్టర్ పోస్టులుండటంతో సీనియర్‌లకు మొండి చెయ్యి చూపుతూ జూనియర్‌లను అందలం ఎక్కిస్తున్నారనేది తొలి నుంచి వినిపిస్తున్న విమర్శలు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సీనియర్‌ను పక్కన బెట్టి జూనియర్‌ను కీలకమైన డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులో నియమించటం జరిగింది.

Also Read : టార్గెట్ బీఆర్ నాయుడు.. డీప్ ఫేక్ తో వైసీపీ దారుణం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో జరిగిన తప్పులను సరిచేసి సీనియర్‌ను మాత్రమే డైరెక్టర్ పోస్టులో నియమించటం జరిగింది. సీనియర్‌లని కాదని.. జూనియర్‌లను కీలకమైన పోస్టులో నియమించే విధానానికి బ్రేక్ వేయాలంటే.. ఐఏఎస్ అధికారిని నియమిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే విషయంపై పలు మార్లు చర్చలు కూడా జరిగాయి. నాలుగు డైరెక్టర్‌ పోస్టుల్లో మూడు పోస్టులను రద్దు చేసి మిగిలిన ఒక పోస్టులో కూడా ఐఏఎస్ అధికారిని నియమించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం అమలు కాలేదు. తాజాగా ఇదే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎంఓ అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈ శాఖలో గ్రూపులు, కులం, సీనియారిటీల కొట్లాటలు తగ్గటం ఖాయం. త్వరలోనే ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్