మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదల వాయిదా పడనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా నిర్ణయించిన తేదీకి సినిమా వచ్చే అవకాశం లేదని, దీని వెనుక ఒక భారీ కారణం ఉందని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. సినిమా విడుదల ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు బుచ్చి బాబు.. ఎక్కడా రాజీ పడకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా ఉండాలని పట్టుబడుతున్నారట.
Also Read : ఇరాన్ పై అమెరికా ఏఐ వార్..? ట్రంప్ ఏమన్నారు..?
ముఖ్యంగా సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే మేకర్స్ ఓ రేంజ్ లో కష్టపడుతున్నారు. సినిమాలోని హైలైట్ అని చెప్తున్న.. క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక ఫైట్ సీన్ గ్రాఫిక్స్ కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేస్తున్నారట.
Also Read : విశాఖలో IBM గ్రాండ్ ఎంట్రీ.. లోకేష్ ట్వీట్ వైరల్
రామ్ చరణ్ కూడా నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదని చిత్ర బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. సినిమా కొంచెం ఆలస్యమైనా సరే, ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనేది టీమ్ ఉద్దేశ్యం. అందుకే గ్రాఫిక్స్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అసలే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరగడంతో, పెద్ది పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ విజువల్ వండర్‌ను వెండితెరపై చూడాలంటే మెగా ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు అంటున్నారు టాలీవుడ్ జనాలు.

