Tuesday, August 4, 2026 05:53 PM
Tuesday, August 4, 2026 05:53 PM

దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్‌ లో ప్రభాస్..? పాన్ వరల్డ్ ప్లాన్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. చాలా కాలంగా ప్రభాస్‌ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న దిల్ రాజుకు, ఎట్టకేలకు ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు ఏకంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌ ను కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమా కేవలం కమర్షియల్ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, భారీ సోషియో-ఫాంటసీ ఎలిమెంట్స్‌ తో ఉండబోతోందని సమాచారం.

Also Read : అదిరిపోయిన రష్మిక బర్త్ డే గిఫ్ట్..!

విజువల్ ఎఫెక్ట్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ కథలో ప్రభాస్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ ఫుల్‌ గా, దైవిక అంశాలతో కూడి ఉంటుందని టాక్. ప్రభాస్‌ కు కథ నచ్చడంతో దిల్ రాజు ఆ యంగ్ డైరెక్టర్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. ఇప్పటివరకు చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలతో హిట్లు కొట్టిన ఆ దర్శకుడికి, ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌ ను హ్యాండిల్ చేసే అవకాశం రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Also Read : అలకపాన్పు ఎక్కిన జమ్మలమడుగు ఎమ్మెల్యే..!

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ప్రభాస్ – దిల్ రాజు కాంబోలో వచ్చిన మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి, అది కూడా 500 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నారంటే అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్