Tuesday, August 4, 2026 04:51 PM
Tuesday, August 4, 2026 04:51 PM

రాకా.. ఓ రేంజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. మాస్ కు పండగే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన రాకా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, అల్లు అర్జున్ ఈసారి మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ ఫుల్, డార్క్ గ్యాంగ్‌ స్టర్ రోల్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. రాకా కేవలం ఒక సాధారణ అండర్ వరల్డ్ గ్యాంగ్‌ స్టర్ కథ మాత్రమే కాదు. ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి అట్లీ ఒక విభిన్నమైన మాస్ డ్రామాను సిద్ధం చేసాడు.

Also Read : నేతల్లో విభజన భయం.. కార్యకర్తలకు దూరం..!

పోస్టర్‌ లో బన్నీ లుక్ చూస్తుంటే, ఒక మృగం లాంటి మనిషిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అందుకే ఈ సినిమాకు రాకా.. రాక్షసుడు అనే అర్థం వచ్చేలా.. పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ సరసన గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తుండటంతో, ఈ గ్యాంగ్‌ స్టర్ వార్ అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న క్రేజీ అప్డేట్ ఏంటంటే.. ఇందులో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Also Read : “రాకా” వందల కోట్ల బడ్జెట్.. వెయ్యి కోట్ల టార్గెట్..!

తాత, తండ్రి, ఇద్దరు కొడుకులు కనిపిస్తాడని టాక్. ఒకే సినిమాలో ఇంతమంది ఐకాన్ స్టార్ లను చూడటం అంటే.. ఫ్యాన్స్‌ కు పూనకాలు గ్యారెంటీ. గ్యాంగ్‌ స్టర్ వరల్డ్‌ లో ఒక ఫ్యామిలీ చేసే యుద్ధమే ఈ రాకా అని సమాచారం. జవాన్ తో భారీ హిట్ అందుకున్న అట్లీ, ఇప్పుడు బన్నీతో అంతకు మించిన యాక్షన్ సీక్వెన్స్‌ లను ప్లాన్ చేసినట్లు టాక్. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన గ్యాంగ్‌ స్టర్ సినిమాల్లో ఒకటిగా నిలవనుందనడంలో డౌట్ లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్