Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

మోడీ షాకింగ్ నిర్ణయం.. వారసుడు ఎవరు..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా..? అంటే అవునని సమాధానం వినపడుతోంది. పదేళ్ల క్రితం తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ముఖ్యమంత్రిగా.. తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు ప్రధానమంత్రిగా అడుగుపెట్టిన ఘనత ఆయనకే సొంతం. ప్రస్తుతం బిజెపిలో రిటైర్మెంట్ వయసు 75 ఏళ్లుగా ఉంది. దీనితో తనకు 75 ఏళ్లు పూర్తయ్య సమయానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నారు.

Also Read :భారత్ ను భయపెడుతున్న ట్రంప్ డర్టీ 15

దీనికి సంబంధించి రెండు ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రిగా ఎంపిక కావడంతో మోడీ వెనక్కు తగ్గుతారా అనేదానిపై కూడా చర్చ జరిగింది. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఇక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరం కావాలని మోడీ భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వానికి ఇదే అంశాన్ని మోడీ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్య అవకాశాలు కూడా ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.

Also Read : మారని గోయెంకా తీరు.. నిన్న రాహుల్ నేడు పంత్ 

సెప్టెంబర్ 16 నాటికి ఆయన ప్రధానమంత్రిగా రాజీనామా చేసే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనితో మోడీ వారసుడు ఎవరు అనేదానిపై బీజేపీతో పాటుగా ఇతర రాజకీయ పార్టీల్లో కూడా పెద్ద చర్చ మొదలైంది. హోం మంత్రి అమిత్ షా ఆ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండవచ్చని జాతీయ మీడియా చెప్తోంది. 2019లో తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టిన అమిత్ షా ప్రధానమంత్రి కావాలని పట్టుదలగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాని భాద్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తు దిశగా ఆలోచించే అలవాటు ఉన్న బిజెపి నాయకత్వం యువకుడు, ఎలాంటి వివాదాలు లేని ఫడ్నవిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

Also Read : 5 ఏళ్ళ బటన్ల నొక్కుడుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

అందుకే ఎన్డీఏ పార్టీలతో ఆయన ఎక్కువగా సఖ్యతతో మెలుగుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి మోడీ రాజీనామా చేస్తారా అలాగే కొనసాగుతారా అనేది చూడాలి. అయితే ఈసారి గుజరాత్ నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి బిజెపి తరఫున ఉండే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరి ప్రధానమంత్రి పదవి కోసం ఆశపడుతున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. ప్రధాని పదవికి పోటీలో నితిన్ గడ్కారి మరియు దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరి అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్