Tuesday, September 22, 2026 06:30 AM
Tuesday, September 22, 2026 06:30 AM

నాటుకోడి రేట్ ఎక్కువగా ఉంది.. పార్లమెంట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి..!

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి పార్లమెంట్ ఉభయ సభల వరకు ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పలానా గ్రామంలో రోడ్డు లేదు, నీరు లేదు.. బెల్ట్ షాప్ లు ఉన్నాయి, ఇళ్ళ పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారని.. నగరాల్లో రోడ్డు లేదు, వాటర్ కనెక్షన్ లేదు.. పలానా అద్దె దందా కొనసాగుతోంది, నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్, మద్యం బ్లాక్ మార్కెట్, ఇతరత్రా ప్రజలు ఇబ్బంది పడే కార్యక్రమాలు అంటూ ఎన్నో ప్రస్తావిస్తూ ఉంటారు. వాటి పరిష్కారాలు అడుగుతారు.

Also Read : ఏపీ కేబినేట్ సంచలన నిర్ణయం..!

ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో వీటి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. కానీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓ సంచలన విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో మటన్ కంటే నాటు కోడి ధర ఎక్కువగా ఉందంటూ ఆయన పార్లమెంట్ లో ఓ కామెంట్ చేసారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఏకంగా పార్లమెంట్ లో అడిగారు అవినాష్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పౌల్ట్రీ రైతుల కోసం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, పౌల్ట్రీ భీమా చర్యలను తీసుకుందా.. ఒకవేళ తీసుకోకపోతే అందుకు గల కారణాలు ఏంటీ అని అడిగారు.

Also Read : ముంబై అండర్ వరల్డ్ లో హిందూ డాన్ ఎంట్రీ..?

దీనికి కేంద్ర పశు సంవర్ధక శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఏపీలో నాటుకోడి మాంసం ధర 500 ఉండగా, మటన్ ధర దాదాపు 900 వరకు ఉందని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుంచి సమాచారం అందింది అంటూ తెలిపారు. ఈ ప్రశ్నతో అక్కడ ఉన్న వారు కూడా షాక్ అయ్యారు. ఎంపీ అడిగే ప్రశ్నలు ఇంకేం లేవా అంటూ గుసగుసలు ఆడుకున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల...

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్...

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ...

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ...

పోల్స్