Wednesday, May 6, 2026 08:33 PM
Wednesday, May 6, 2026 08:33 PM

జాతీయ పార్టీగా జనసేన.. పవన్ కీలక నిర్ణయం..!

11 ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత జనసేన పార్టీ దూకుడు పెంచుతుంది. 2024లో ఏపీలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు తెలంగాణ పై కూడా దృష్టి సారించింది. పార్టీ నాయకత్వాన్ని గాడిలో పెట్టేందుకు.. కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చేందుకు, ఇతర పార్టీలలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నాయకులను ఆహ్వానించేందుకు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. తెలంగాణలో పార్టీ పోటీ చేయాలని ఎప్పటినుంచో కార్యకర్తలు కోరుతూనే ఉన్నారు. 2021 లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని అందరూ ఎదురు చూశారు.

Also Read : సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు..!

అయితే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల తో పాటుగా, పరిషత్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కొండగట్టు ఆలయం వేదికగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని తెలంగాణల వేగవంతం చేసే దిశగా అడుగులు మొదలు పెట్టారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని పవన్ భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్ పర్యటనలకు మంచి స్పందన వస్తోంది. ఆలస్యం చేయకుండా పార్టీ నియామకాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు.

Also Read : షర్మిల మౌనం… మార్పుకు సంకేతమా?

త్వరలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుతో పాటుగా ఏపీ అధ్యక్షుడుని కూడా అడుగులు వేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ నియామకాలను పూర్తి చేయాలని.. పార్లమెంటరీ కమిటీలను కూడా వేసి.. సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పవన్ భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు తెలంగాణలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్