Thursday, February 12, 2026 05:33 PM
Thursday, February 12, 2026 05:33 PM

ఆఫ్ ది రికార్డు వార్తలు.. పుకార్లు..!

ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కాదు..”కమ్మ” ని ప్రభుత్వం అని, టీడీపీ మాజీ మంత్రి, బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్ పెద్ద దుమారం రేపింది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక.. డ్రగ్స్ కేసులో ఇరుకున్న తన కుమారుడి పై నమోదు అయిన కేసుల నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో ఓ మాట చెప్పి బయట పడేయాలని సీఎం చంద్రబాబును స్వయంగా కోరినా, చంద్రబాబు అందుకు అంగీకరించ లేదట. ఆ కోపంతోనే చంద్రబాబు పైన కమ్మ కులం ముద్ర వేశారనే మాట బాగా వినిపిస్తోంది. ఆయన కాంగ్రెస్‌లో, వైసీపీలో ఉన్నప్పుడు కూడా కమ్మ కులం వ్యతిరేకిగా కామెంట్‌లు చేసిన సందర్భాలున్నాయి. కడప రెడ్డి గారు కదా.. రెడ్డి కులం ఫీలింగ్.. కమ్మ కులం పై వ్యతిరేకత సహజంగానే ఉంటుందనే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది.

Also Read : లిక్కర్ కేసుపై సుప్రీం సంచలన కామెంట్స్..!

ఇక హైదరాబాద్ కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు ధర పలికింది. అమరావతిలో భూముల విలువ కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు భూములు అమ్మవద్దని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇప్పటివరకు మా ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు.. ఇంకెన్నాళ్లకు ఇస్తారని చంద్రబాబునే నిలదీయాలని అమరావతి రైతులు అనుకుంటున్నారట. మీ భూములు విలువ ఏదో ఒక రోజు రూ.100 కోట్లు విలువ పెరుగుతుందని చెప్పగానే అమరావతి రైతులు చల్లభడ్డారనే మాట బాగా వినిపిస్తోంది. చెప్పింది చంద్రబాబు కదా.. అందుకే ఆయనను నిలదీయకుండా మౌనంగా ఉన్నారంటున్నారు. మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోరాటం చేసిన రైతులే.. ఇప్పుడు చంద్రబాబు మాట ఎలా వింటున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. అభివృద్ధి పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీలను విశాఖపట్నం తరలిస్తుంటే.. మా భూముల రేటు 100 కోట్లకు ఎప్పుడు పెరుగుతుందా అని అమరావతి రైతులు ఆశగా చూస్తున్నారనే పుకార్లు బాగా షికారు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో సుమారు 8 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున రావడంతో రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగింది. కాబట్టి కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు పలికింది. అమరావతిలో ఎకరం వంద కోట్లు కాదు.. పట్టు మనీ పది కోట్ల రేటుకు కూడా ప్రస్తుతం కొనే వారు కనిపించటం లేదు అనేది బహిరంగ రహస్యం. ఇక్కడ సాఫ్ట్‌వేర్ సంస్థలు లేవు. భవిష్యత్తులో వస్తాయో.. రావో.. తెలియదు. అలాంటప్పుడు భూములు రేట్లు ఎలా పెరుగుతాయనేది అమరావతిలో బాగా వినిపిస్తోంది. అంత రేటు పెట్టి కొనేవారెవరు అని అమరావతి రైతులు చర్చించుకుంటున్నారు.

Also Read : బ్రేకింగ్: వన్డే వరల్డ్ కప్ పై రోహిత్ సంచలన కామెంట్స్..!

మహాభారతంలో అందరికీ పితామహుడు భీష్ముడే.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. ఎవరు సీఎంగా ఉన్నా సరే.. వారందరికీ పితామవుడైన భీష్ముడు మాదిరిగా.. పారిశ్రామిక, వ్యాపార పితామహుడు ఆదాని వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇటు సీఎం చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీపై విమర్శలు, ఆరోపణలు చేసిన వారే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అదానీ సంస్థలకు భారీ తాయిలాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు అనే చర్చ జోరుగా జరుగుతోంది. అంతా డబ్బు మహిమా అనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. మహేష్ బాబుహీరోగా వచ్చిన మహర్షి సినిమాలో నాజర్ చెప్పిన.. “కార్పొరేట్ రూల్ ద గవర్నమెంట్..” అనే డైలాగ్‌ నిజమే అని ఇప్పుడు ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ పుకార్లకు చెక్ పడుతుందా..?

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే నిరూపించాలి.. వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా...

ఇది చంద్రబాబు ఇచ్చే...

గత ఏడాది కాలంగా ఏపీలో తిరువూరు...

లిక్కర్ కేసుపై సుప్రీం...

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో ఇప్పటికీ...

సెలవు పై ఐఏఎస్...

సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్...

బిల్డప్ అదుర్స్.. బొమ్మ...

అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు..! ఈ...

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

పోల్స్