Friday, April 3, 2026 04:50 AM
Friday, April 3, 2026 04:50 AM

అర్ధరాత్రి కొలంబోలో.. ఉదయం గన్నవరంలో.. ఆశ్చర్యపరిచిన లోకేష్..!

సాధారణంగా రాజకీయ నాయకులు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారి షెడ్యూల్ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. బిజీ బిజీగా గడిపే పాలకులు.. ఎప్పుడు ఎక్కడ ఉంటారో అంచనా వేయడం కష్టమే. ఇందులో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుది కాస్త భిన్నశైలి. వయసు మీద పడినప్పటికీ చంద్రబాబు మాత్రం దూకుడుగా పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రెండవ సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. బిజీ షెడ్యూల్ తో అధికారులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.

Also Read : భారత్‌కు శివరాత్రి.. పాకిస్తాన్‌కు కాళరాత్రి..!

నిన్న సాయంత్రం లోకేష్.. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా గన్నవరం వచ్చేశారు లోకేష్. కొలంబోలో అర్ధరాత్రి వరకు ఉన్న మంత్రి.. అనంతరం నేరుగా గన్నవరం వచ్చేసి.. బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు. ఇక మధ్యాహ్నం నుంచి ఆయన నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అవుతారు. కేంద్ర హోం శాఖా మంత్రితో కూడా లోకేష్ భేటీ కానున్నారు. గతంలో ఈ షెడ్యూల్ సిఎం చంద్రబాబులో చూసేవారు.

Also Read : ముగిసిన రాజకీయ ప్రస్థానం.. తిరిగి ఉద్యోగం..!

అయితే లోకేష్ మాత్రం.. పరిపాలనతో పాటుగా లైఫ్ కూడా ఎంజాయ్ చేయడం ఆశ్చర్యపరిచే విషయమే. సాధారణంగా చంద్రబాబు.. పర్సనల్ లైఫ్ కు ప్రయారిటీ ఇచ్చేవారు కాదు. కాని లోకేష్ మాత్రం పరిపాలనతో పాటుగా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రాత్రి మ్యాచ్ చూస్తున్న ఫోటోలు, ఈ రోజు గన్నవరం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబుకి తలనొప్పిగా మారుతున్న...

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహారశైలి టిడిపి...

బాబు మాస్టర్ స్ట్రోక్.....

అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి...

అంచనాలు పెంచిన ‘రామాయణ’...

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం...

అమరావతి అంటే జగన్...

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధాని...

ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం...

కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై...

ఈసారి మావిగన్ అంటున్న...

ఎవరికైనా చూపించండి రా.. అలా వదిలేయకండి...

పోల్స్