Thursday, May 7, 2026 06:43 AM
Thursday, May 7, 2026 06:43 AM

రేవంత్ ను ముంచేస్తున్న ఎమ్మెల్యేలు

తెలంగాణలో గులాబీ పార్టీపై వ్యతిరేకతతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక గులాబీ పార్టీ పాలన మరిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలంగాణలో ఊపందుకుంటాయని భావించారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కొన్నింటిలో ఆలస్యం జరుగుతున్న మరికొన్ని మాత్రం అమలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త వెనుకబడ్డారు అనే ఆరోపణ కూడా ఉంది.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

అయితే తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలు.. రేవంత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఇబ్బంది పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ఇబ్బందిగా మారుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. వ్యాపారాల నుంచి ఉద్యోగాల వరకు ఏ విషయంలో కూడా ఎమ్మెల్యేలు సంపాదన విషయంలో వెనకడుగు వేయడం లేదనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది.

Also Read : షిర్డీ సాయిపై పవన్ ఫోకస్, విచారణకు రంగం సిద్దం..!

చాలామంది ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి తోడు రేషన్ కార్డుల జారీ తో పాటుగా ఇళ్లను కేటాయించే విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కులపిచ్చి చూపిస్తున్నారు అనేది తెలంగాణలో ఎక్కువగా వినపడుతోంది. తమకు అనుకూలంగా ఉండే వారికే ఎక్కువగా రేషన్ కార్డులతో పాటుగా ఇళ్లను కూడా కేటాయిస్తున్నారని.. కనీసం రేషన్ కార్డు లేని వారికి కూడా ఇళ్ల కేటాయింపు జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. దానికి తోడు ఇల్లు ఉన్న వారికే ఇల్లు ఇస్తున్నారని.. ఇక గులాబీ పార్టీలో తమకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రైతు భరోసాతో పాటుగా కొన్ని కార్యక్రమాలను అమలు చేయిస్తున్నారనేది వినపడుతోంది. రేషన్ కార్డుల విషయంలో కూడా గతంలో భారత రాష్ట్ర సమితిలో కీలకంగా వ్యవహరించిన వారికి ఇప్పుడు మాట చెల్లుతుంది అంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్