Saturday, September 19, 2026 02:42 PM
Saturday, September 19, 2026 02:42 PM

పెంపుడు జంతువులను పెంచుతున్నారా..? అలెర్ట్ అవ్వండి..!

భారతదేశంతో సహా ఎనిమిది దేశాలలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వ్ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 14,000 మందికి పైగా పెంపుడు జంతువుల యజమానులు, 1,750 మంది పశువైద్య నిపుణులతో ఇటీవల నిర్వహించిన రాయల్ కానిన్ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. పెంపుడు జంతువులలో ఊబకాయ సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% యుక్త వయసులో ఉన్న పిల్లులు, కుక్కలు.. అధిక బరువు లేదా ఊబకాయంతో బాధ పడుతున్నట్టు వెల్లడి అయింది.

Also Read : సింధూ నది ఒప్పందం రద్దైతే పాక్ లో ఏం జరుగబోతోంది..?

పెంపుడు జంతువులలో ఊబకాయానికి కారణం వాటిని ప్రేమగా పెంచడమే అని తెలిపింది. అతిగా తిండి పెట్టడం, ముద్దుగా, శుభ్రంగా ఉంచాలి అనుకుని వ్యాయామం లేకుండా చేయడంతోనే బరువు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. తోక ఊపినా, మియావ్ అని పిల్లి అరిచినా ఆకలి అనుకుని వాటికి అతిగా పెట్టేస్తున్నారని, అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు పంపిస్తున్నామన్నారు వైద్యులు. 41% పెంపుడు జంతువుల యజమానులు పెంపుడు జంతువులకు.. బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యేక భోజనాలు పెడుతున్నారని ఇది ప్రమాదమని తెలిపారు.

Also Read : పాపం జగన్.. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదా..!

మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్, శ్వాస సమస్యలు, శస్త్రచికిత్స సమయంలో సమస్యలు, జీవిత కాలం తగ్గడం, వాటిల్లో భావోద్వేగాలు తగ్గడం వంటివి జరుగుతాయని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండాలని తెలిపారు. వయసుకు తగ్గ ఆహారం ఇస్తే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇక పెంపుడు జంతువుల భారం ఎక్కువై కుక్కల యజమానులలో 38% మంది, పిల్లి యజమానులలో 57% మంది వచ్చే ఏడాదిలో తమ పెంపుడు జంతువును వదులుకోవాలని ఆలోచిస్తున్నట్లు సర్వేలో బయటపెట్టారు. వాటి అవసరాలను గ్రహించి ఆహారం అందించడమే గాని ప్రేమతో అతిగా వద్దని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్