Saturday, February 14, 2026 06:14 PM
Saturday, February 14, 2026 06:14 PM

వైరల్ గా మారిన కిమ్ కూతురు.. ఎందుకంత స్పెషల్..?

కలియుగ నియంత అనగానే మన కళ్ళ ముందు కనపడే ఒకే ఒక రూపం.. కిమ్ జోంగ్ ఉన్. బాబు ఏది చేసినా స్పెషల్ గానే ఉంటుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా రాజ్యమేలుతున్న కిమ్ జోంగ్.. ఇప్పుడు తన వారసుల ఎంపికలో పడ్డారు. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏను తన వారసురాలిగా ఎన్నుకోవచ్చని దక్షిణ కొరియా ఎంపీలు ఓ ప్రకటన చేసారు. గూడచారి సంస్థ ద్వారా తమకు సమాచారం ఉందని తెలిపారు. అదే జరిగితే.. ఆ దేశ నాల్గవ తరం నాయకురాలిగా ఆమె నిలుస్తారు.

Also Read : ఏపీ బడ్జెట్ విశేషాలు.. వాటికే ప్రాధాన్యత..!

దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. అయితే ఆమె ఎవరు ఏంటీ అనేది మాత్రం ప్రపంచానికి పూర్తి వివరాలు తెలియదు. వయసు మాత్రం 13 ఏళ్ళుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. 2013లో అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ డెన్నిస్ రాడ్‌మన్ ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌ కు వెళ్ళినప్పుడు.. కిమ్ కు కూతురు ఉన్నట్టు ప్రపంచానికి తెలిసింది. డెన్నిస్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. వాళ్ళ కూతురుని ఎత్తుకుని.. కిమ్ భార్యతో మాట్లాడాను అని చెప్పుకొచ్చాడు.

Also Read : అధినేతపై గుర్రుగా క్యాడర్.. అసలున్నాడా..!

కిమ్ జోంగ్ ఉన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని అందులో.. ఈమె రెండవ కూతురుగా చెప్పినా దీనిపై స్పష్టత లేదు. 2022లో జరిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షా ప్రయోగంలో ఆమె తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. అయితే ఈ నిర్ణయాన్ని కిమ్ సోదరి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు. అయితే ఆరోగ్యంగా కనిపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. ఇంత త్వరగా తన కుమార్తెను వారసురాలిగా ఎందుకు ప్రకటిస్తున్నారో మాత్రం స్పష్టత లేదు. 1948లో ఉత్తర కొరియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన నాటి నుంచి.. కిమ్ కుటుంబానికి చెందిన పురుషులే ఆ దేశాన్ని పాలించారు. దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్-సంగ్‌ తో ప్రారంభించి, అతని కుమారుడు కిమ్ జోంగ్-ఇల్, మనవడు కిమ్ జోంగ్ ఉన్ పురుషులే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పవన్ ను ఎందుకు...

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం...

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

పోల్స్