Sunday, June 21, 2026 02:44 AM
Sunday, June 21, 2026 02:44 AM

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ కీలక సూచనలు..!

మాలధారణ భక్తులు పెద్ద ఎత్తున కేరళ చేరుకుంటున్న నేపధ్యంలో.. వ్యాపిస్తున్న వైరస్ లపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్నాళ్ళుగా కేరళలో ఏదోక వైరస్ ఉనికి కనపడుతోంది. ఈ మధ్య కాలంలో కనపడని వైరస్ లు కేరళలో బయటపడటం, ఆఫ్రికా దేశాల్లో ఉండే కొన్ని వైరస్ ల ఉనికి కూడా కేరళలో బయటపడటం వెనుక ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ వ్యాప్తంగా బ్రెయిన్ ఫీవర్ ఉందనే ప్రచారం కూడా భక్తులను కలవరానికి గురి చేస్తోంది. ఇక శబరీమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

Also Read : అంతా నా ఇష్టం అంటున్న జగన్

యాత్రికుల సంఖ్య మరింత పెరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తమైంది. కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 24 నవంబర్ 2025 వరకు – వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని ప్రకటించింది. దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదని తెలిపింది. స్పాట్ బుకింగ్ కోటా రోజుకు 5,000 – కోటా పూర్తయితే బుకింగ్ లేదని ప్రభుత్వం తెలిపింది.

Also Read : బ్యాంకు స్టేట్మెంట్ తో అడ్డంగా దొరికిన జోగి..?

స్పాట్ బుకింగ్ కేంద్రాలు.. నీలక్కల్, వండిపెరియార్–సత్రం, ఎరుమెలి, చెంగన్నూర్ గా ప్రకటించింది. నీలక్కల్‌లో కోటా ముందే ముగిసే అవకాశం ఉండటంతో యాత్రికులు ఇతర కేంద్రాల్లోనే పాస్ పొందాలని సూచనలు చేసింది. శబరిమలకు బయలుదేరే ముందు పాస్ తమ వద్ద ఉందని యాత్రికులు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి అని సూచించింది. నీలక్కల్, పంపా, సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా హెల్ప్ లైన్ నెంబర్ లను కూడా ప్రకటించింది. శబరిమల హెల్ప్‌లైన్: 14432, ఇతర రాష్ట్రాల నుంచి శబరిమల వచ్చే భక్తులకు హెల్ప్ లైన్ నంబర్..04735-14432 లను సంప్రదించాలని సూచించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్