Sunday, June 21, 2026 03:48 AM
Sunday, June 21, 2026 03:48 AM

కన్నప్ప మంచు కుటుంబానికి ప్రాణం పోసిందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన మంచు కుటుంబం గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతోంది. కలెక్షన్ కింగ్ గా పేరున్న మోహన్ బాబు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ మధ్య కాలంలో హిట్ కొట్టలేకపోవడం.. ఆయన కుమారులు, విష్ణు, మనోజ్ ఇద్దరూ కూడా సినిమా పరిశ్రమలో ఫెయిల్ కావడం ఆ కుటుంబ అభిమానులను ఆందోళనకు గురి చేసిన అంశం. ఈ మధ్య కాలంలో కూడా పలు సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : బూమ్రా లేకపోతే ఇండియాకు సీన్ లేదా..?

మంచు విష్ణు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇలాంటి సమయంలో భారీ అంచనాలతో వచ్చిన కన్నప్ప సినిమా మాత్రం మంచు కుటుంబానికి ప్రాణం పోసింది అనే చెప్పాలి. ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులను ఈ సినిమా కోసం ఒప్పించింది మంచు కుటుంబం. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో చేయడంతో ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూడటానికి రావడం కలిసి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ను సినిమాలో చూపించారు.

Also Read : సీతక్కకు షాక్ ఇచ్చిన మావోయిస్ట్ లు..!

దీనితో సినిమా చూడటానికి వచ్చిన వారి సినిమా అయ్యే వరకు ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. సినిమాను ముందు తిట్టిన వారు కూడా సైలెంట్ అయ్యారు. వసూళ్లు కూడా భారీగానే వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ సినిమాతో తాను ఏంటీ అనేది మంచు విష్ణు ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఇవ్వకుండా తీసుకున్న సినిమా యూనిట్.. లాభాల్లో వాటా ఇవ్వాలని కోరుతున్నారు. సినిమా ఖచ్చితంగా రెండు వారాలు ప్రభావం చూపడం ఖాయం అంటున్నారు సినిమా అనలిస్ట్ లు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్