Friday, February 13, 2026 05:32 PM
Friday, February 13, 2026 05:32 PM

కేటీఆర్‌కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టిన కవిత..!

టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ మొదలుపెట్టిన కల్వకుంట్ల కవిత.. ఫస్ట్ సక్సెస్ సాధించారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెడుతూ.. మొత్తం 10 వార్డులకు గాను ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.

Also Read : పురపోరులో గురిపెట్టి కొట్టిన రేవంత్..!

తాను ప్రత్యేక రాజకీయ పార్టీ ఇప్పట్లో మొదలుపెట్టేది లేదన్న కవిత.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయటం లేదన్నారు కవిత. అయితే తన అభిమానుల కోరిక మేరకు.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కవిత మద్దతుదారులు ఈ పుర ఎన్నికల్లో బరిలోకి దిగారు. 40 మున్సిపాలిటీల్లోని 212 వార్డుల్లో పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు.

అయితే తొలి నుంచి కవితతో పాటు AIFB అభ్యర్థులను ప్రధాన పార్టీలు లైట్ తీసుకున్నాయి. వాళ్లకు డిపాజిట్ వస్తే చాలు అన్నట్లుగా ఎద్దేవా చేశారు కూడా. అయితే ఎన్నికల్లో కవిత మద్దతుదారులు సంచలనం సృష్టించారు. వడ్డేపల్లి మునిసిపాలిటీలో 10లో 8 వార్డుల్లో గెలిచి చైర్మన్ కుర్చీ దక్కించుకున్నారు. సుల్తానా బాద్‌లో ఒక వార్డులో, పెద్దపల్లిలో 1 వార్డు, మంథనిలో 1 వార్డు గెలుచుకున్నారు. రామగుండం, ఆదిలాబాద్‌‌, మంచిర్యాలలో ప్రధాన పార్టీల నేతలకు ఫార్వడ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు షాక్ ఇచ్చారు. హంగ్ ఫలితాలు వచ్చే మునిసిపాలిటీల్లో కవిత మద్దతుదారులు చాలా కీలకం కానున్నారు.

Also Read : బంగ్లా ఎన్నికల ఫలితాలు.. ఫుల్ జోష్ లో మోడీ..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అత్యంత కీలకంగా మారారు. మొత్తం 11 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రధాన పార్టీల అభ్యర్థులను కాదని.. 7వ వార్డులో గాదె వెంకటేశ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అలియాబాద్ మునిసిపాలిటీలో మొత్తం 20 వార్డులకు 8 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 3 బీజేపీ, ఒక స్థానం బీఎస్పీ గెలుచుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో గాదె వెంకటేశ్ కీలకంగా మారారు. దీంతో తనకు చైర్మన్ పదవి ఏ పార్టీ ఇస్తే వారికే తన మద్దతు అని వెంకటేశ్ ప్రకటించారు. దీంతో చైర్మన్ కుర్చీ ఎవరికి అనే ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

‘–40’ మార్కులతో వైద్య...

ఒకప్పుడు వైద్యుడు కావడం అంటే అత్యంత...

పురపోరులో గురిపెట్టి కొట్టిన...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని...

కేసీఆర్ అరెస్టుపై రేవంత్...

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం...

ఆత్మీయ క‌ల‌యిక‌.. ఇల్లే...

పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను...

బ్రేకింగ్: అరవ శ్రీధర్...

గత నెల రోజులుగా జనసేన పార్టీ...

పోల్స్