Tuesday, July 7, 2026 02:13 PM
Tuesday, July 7, 2026 02:13 PM

పురపోరులో గురిపెట్టి కొట్టిన రేవంత్..!

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. పంచాయితీ ఎన్నికలను మించి సాగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిగా చిన్న పాటి యుద్దమే జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో హవా కనబరిచింది. పంచాయితీ ఎన్నికల మాదిరి ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా నడిచింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ కూడా తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో మెజారిటీ స్థానాలు గెలిచింది అనే చెప్పాలి.

Also Read : టీడీపీ డెల్టా, పల్నాడు టైగర్లు ఎక్కడ..?

పురపోరులో దూసుకుపోతున్న కాంగ్రెస్.. 75కు పైగా మున్సిపాలిటీలో విజయాలు సాధించింది. బీఆర్ఎస్ మాత్రం ప్రచారం గట్టిగా చేసినా.. ఆశించిన ఫలితాలు రాబట్టడంలో ఫెయిల్ అయింది. ఇక బీజేపి నేతలు ప్రచారం గట్టిగా చేసినా.. పంచాయితీ ఎన్నికల మాదిరి బోల్తా పడ్డారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూడా కొంత ప్రభావం చూపగా.. గద్వాల జిల్లా వడ్ఢేపల్లిలో కవిత హవా కనపడింది. AIFB సింబల్ తో కవిత అభ్యర్థులు విజయం సాధించారు. జాగృతి పార్టీ నుంచి కవిత వారిని పోటీలో నిలబెట్టారు.

Also Read : కేసీఆర్ అరెస్టుపై రేవంత్ క్లారిటీ..!

బీఆర్ఎస్ నుంచి హడావుడి చేసే పాడి కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యేగా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ డామినేషన్ నడిచింది. కరీంనగర్ టౌన్ లో బిజెపి కొంత ప్రభావం చూపింది అనే చెప్పాలి. సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ సమర్ధవంతంగా ఎదుర్కొంది అనే చెప్పాలి. ఇక బిజెపి నేతల మధ్య విభేదాలు, సఖ్యత లేకపోవడం ఈ ఎన్నికలపై ప్రభావం చూపింది అనే కామెంట్స్ వస్తున్నాయి. 8 మంది ఎంపీలు ఉన్నా స్థానిక సంస్థల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్