Wednesday, August 5, 2026 12:39 PM
Wednesday, August 5, 2026 12:39 PM

కల్తీ మద్యం: తాతల కాలం నుంచే జోగి – అద్దేపల్లి కుటుంబాల స్నేహం

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ముందు నుంచి వాదిస్తూ వస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీయడం మొదలుపెట్టారు. జోగి రమేష్ పాత్రకు సంబంధించి పక్క ఆధారాలను కోర్టు ముందు ఉంచేందుకు పెద్ద ఎత్తున విచారణ చేస్తున్న అధికారులు.. ఇటీవల సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో గోవాలో ఉండే వ్యక్తుల పాత్ర కూడా ఉందని, గోవాలోని కొన్ని బార్లకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లు గుర్తించారు.

Also Read : మనిషి ఇక్కడే ఉన్నా మనసు అక్కడే.. కరణం ఆవేదన

ఇక ఈ కేసులో ఏ 1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్ధన రావుకు, జోగి రమేష్ కు మధ్య ఉన్న సంబంధాలను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా సంచలన విషయాలను గుర్తించారు. జోగి, అద్దేపల్లి కుటుంబాల మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నట్లు గుర్తించారు. తాతల కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తేల్చారు. గత పదేళ్లుగా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు నడుస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read : వైసీపీ నేతలతో పిల్లల్ని పంపకండి.. అనిత సంచలన కామెంట్స్

ఇదే సమయంలో మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. జోగి రమేష్ ఎన్నికల ఖర్చును కూడా అద్దేపల్లి జనార్దన్ రావు భరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీ హయంలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేయడంలో భాగంగా.. అద్దేపల్లి జనార్దన్ రావుకు జోగి రమేష్ పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులకు లిక్కర్ సప్లై చేశారని, లిక్కర్ సప్లై ముసుగులో నకిలీ మద్యం సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇక జోగి రమేష్, అద్దేపల్లి ని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్