ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి, విశ్వవిజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ ఆటగాళ్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఈ విషయంలో ముందుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా భారత మహిళా జట్టును తన నివాసానికి ఆహ్వానించారు. సాధారణంగా క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ముందుండే ప్రధాని మోడీ.. భారత పురుషుల జట్టును కూడా గతంలో ఇదేవిధంగా ప్రోత్సహించారు. ఓడిపోయిన సందర్భంగా కూడా ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Also Read : కరీంనగర్ వాసులకు బండి బంపర్ ఆఫర్..!
తాజాగా మహిళా క్రికెటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళ్లగా.. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు మోడీ. ఈ సందర్భంగా మహిళ క్రీడాకారుల ఆర్థిక పరిస్థితి, వారి బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇదేవిధంగా మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని క్రీడాకారులకు భరోసా ఇచ్చారు మోడీ. ఈ సందర్భంగా భారత మహిళా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ మోడీతో ఓ సరదా కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read :వైసీపీ నేతలతో పిల్లల్ని పంపకండి.. అనిత సంచలన కామెంట్స్
మోడీని కలిసిన సమయంలో.. సార్ మీ స్కిన్ కేర్ రొటీన్ ఏమిటి అంటూ మోడీని అడిగింది. మీరు ఎలా అంత అందంగా ఉంటారంటూ అడగడంతో మోడీ కూడా నవ్వేశారు. సాధారణంగా జట్టులో సరదాగా ఉండే హార్లీన్ స్వయంగా మోడీని ఆ ప్రశ్న అడగడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక దీనికి స్పందించిన మోడీ.. తాను ప్రత్యేకంగా చర్మ రక్షణకు పెద్దగా దృష్టి పెట్టనని, తాను దాదాపు 25 సంవత్సరాలుగా ప్రభుత్వం లో ఉన్నానని, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తన చర్మం మెరిసే రహస్యమని తనదైన రీతిలో కామెంట్ చేశారు. అలాగే ఫిట్నెస్, యోగ, దేశ సేవలో మునిగి ఉండటం కూడా తన గ్లోకు కారణమన్నారు.

