Wednesday, April 1, 2026 05:39 AM
Wednesday, April 1, 2026 05:39 AM

లారెన్స్ గ్యాంగ్ హిట్ లిస్టులో మరో స్టార్ హీరో..!

ఉత్తరాది రాష్ట్రాల్లో లారెన్స్ గ్యాంగ్ కార్యాకలాపాలు ఇప్పుడు బాలీవుడ్ నటులను, రాజకీయ నాయకులను, వ్యాపారస్తులను కంగారు పెడుతున్నాయి. 30 ఏళ్ళ గ్యాంగ్ స్టర్ దెబ్బకు బాలీవుడ్ వణికిపోతుంది. జింకను కాల్చిన వ్యవహారంలో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన లారెన్స్ గ్యాంగ్.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ లపై జరుగుతోన్న దాడుల వెనుక కీలకంగా వ్యవహరిస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన దాడికి లారెన్స్ గ్యాంగ్ కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : బ్రేకింగ్: అరవ శ్రీధర్ అరెస్ట్..?

ఇక తాజాగా మరో స్టార్ హీరోని కూడా బెదిరించింది లారెన్స్ గ్యాంగ్. శుక్రవారం స్టార్ హీరో.. రణ్‌వీర్ సింగ్‌ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈసారి రణవీర్ సింగ్ స్టాఫ్ మొత్తాన్ని గాయపరుస్తాం అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. గుర్తు తెలియని వ్యక్తి పంపిన వాయిస్ మెసేజ్ ను జాతీయ మీడియా సేకరించింది. ” బాత్ సే ముకర్నే కి సజా క్యా హోతీ హై తుఝే బటేంగే (ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే శిక్ష ఏమిటో మేము మీకు చూపిస్తాము)” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : టాలీవుడ్‌లో కొత్త వ్యక్తులు.. పెత్తనానికి బ్రేక్..!

సదరు వ్యక్తి దర్శకుడు రోహిత్ శెట్టిని, బాలీవుడ్‌ మొత్తాన్ని ప్రస్తావిస్తూ, “ లైన్ పే ఆజావో, అగర్ నహీ ఆయే తో బాద్ మే దేఖ్నా క్యా కర్తే హై హమ్ లాగ్ ” అంటే.. మీరు లైన్ లో పడకపోతే మేం చేస్తామో తర్వాత చూస్తారు అంటూ వార్నింగ్ వెళ్ళింది. దీనితో ఆ వ్యక్తి ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రణవీర్ సింగ్ ఇంటి వెలుపల పెద్ద ఎత్తున భద్రతను మొహరించారు. అటు ముంబై పోలీసులతో పాటుగా కేంద్ర భద్రతా బలగాలు కూడా ఈ బెదిరింపులపై దృష్టి పెట్టాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న కాగ్...

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్...

మెగా ఫ్యాన్స్ కు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ధర్నా వ్యవహారంపై సిఎం...

అమరావతిలో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా...

అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్...

ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస...

ఏపీలో ముగిసిన మావోల...

ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు...

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్