Wednesday, August 19, 2026 01:54 AM
Wednesday, August 19, 2026 01:54 AM

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. నిజమేనా..?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్దమో అర్ధం కాని పరిస్థితి. ఎక్కడో ఒక చిన్న ఘటన జరిగితే.. ప్రపంచం మొత్తం భయపడే విధంగా హడావుడి ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత విషయంలో ఇదే హడావుడి నడుస్తోంది. ఎక్కడో నో స్టాక్ అనే బోర్డు పెడితే.. తెలుగు రాష్ట్రాలో పెట్రోల్ బంకుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. దీనితో హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాల రద్దీ తీవ్రమైంది. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ కోసం వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి.

Also read : సుప్రీం తీర్పు.. వారికి కూడా వర్తిస్తుందా..?

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై బంకుల్లో వాహనాలు బారులు తీరడంతో.. హైవేపై పెట్రోల్‌ బంకులు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో భారత్ పెట్రోలియం కీలక ప్రకటన చేసింది. సరిపడా పెట్రోల్ ను సరఫరా చేస్తున్నామని ప్రకటించింది. ఇక ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా తెలిపింది. పెట్రోల్‌, డీజిల్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందన్న అసోసియేషన్‌.. హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వద్ద తగినంత స్టాక్ ఉందని పేర్కొంది.

Also read : మర్యాదగా ఉండు.. కోపం వద్దు.. గంభీర్ కు గంగూలీ సలహా..!

ఇంధన కొరత ఉందన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచనలు చేసింది. ఇంధనం దొరకదనే భయంతో బంకులకు క్యూ కడుతున్నారన్న అసోసియేషన్.. ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపింది. సాధారణ విక్రయాల కంటే దాదాపు మూడు రెట్లు పెరిగాయన్న అసోసియేషన్‌.. సామాజిక మాధ్యమాల్లో వదంతులతో వాహనదారులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ దొరకదనే ఆందోళనతో అధిక మోతాదులో కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసారు. ఇక పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం సైతం ప్రకటించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్