పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధం ఇప్పుడు భారత వంట గదిపై బలంగా పడుతోంది. క్రమంగా పెరిగే అవకాశం ఉన్న ధరల ప్రభావం తీవ్రంగా పడేది మన వంట గదిపైనే అనే క్లారిటీ క్రమంగా వస్తోంది. తాజాగా గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా.. ఇంధన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం కనపడుతోంది. నేటి నుంచి ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలెండర్ ధర 60 రూపాయలు పెరిగింది.
Also Read : దువ్వాడకు రూల్స్ తెలియదా..? మరో వివాదంలో మాధురి..!
కమర్షియల్ గ్యాస్ ధర 114.5 రూపాయలు పెరిగింది. ఈ పెంపు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. రాబోయే వారం రోజుల్లో పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసి వేసిన నేపధ్యంలో భారత్ పై కూడా ఆ ప్రభావం పడుతోంది. ఇంధన ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్రం చెప్తున్నా.. సినిమా మాత్రం మరోలా కనపడుతోంది. రెండు మూడు రోజుల్లోనే పెట్రోల్ ధరల పెంపు విషయంలో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఫేక్ పోస్ట్ లతో మోడీ పరువు తీస్తున్నారా..?
యుద్ధం ఇంకా కొనసాగితే.. బ్యారెల్ చమురు ధర ఏకంగా 200 వరకు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఎక్కడా తగ్గకపోవడంతో.. కూవైట్ సహా అనేక దేశాలు నష్టపోతున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న ఆయిల్ రిఫైనరీల మీద దాడులు జరుగుతున్నాయి. రోజు రోజుకి ఈ దాడుల తీవ్ర పెరగడంతో సౌదీ అరేబియా తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే అమెరికా ఈ దాడులు ఆపాలని కోరుతోంది. కూవైట్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అమెరికాకు హెచ్చరికలు పంపినట్లు సమాచారం.

