Friday, March 6, 2026 02:30 PM
Friday, March 6, 2026 02:30 PM

ఇంగ్లాండ్ పై గెలిస్తే.. భారత్ కు సెంటిమెంట్ ప్లస్..?

లీగ్ దశలో ఈజీగా.. సూపర్ 8 లో కష్టంగా బయటపడిన టీం ఇండియా.. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో మరో కఠిన పరీక్షకు రెడీ అయింది. మొన్న సూపర్ 8 చివరి మ్యాచ్ లో విండీస్ పై చాలా ఈజీగా గెలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దీనితో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ భారత్ కంటే బలహీనంగా కనపడినా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లిష్ జట్టును తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదనే మాట వినపడుతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.

Also Read :విజయవాడకు మరో మెగా ప్రాజెక్టు..!

గురువారం ఐకానిక్ వాంఖడే స్టేడియంలో రెండవ సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా.. రెండుసార్లు టి వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్‌తో తలపడుతుండగా.. రెండు జట్లు టి20 ప్రపంచ కప్‌ లో వరుసగా మూడోసారి సెమీఫైనల్‌ లో తలపడుతున్నాయి. సెమీస్ లో.. గెలిచిన జట్టు ఖచ్చితంగా కప్ గెలుస్తోంది. రెండేళ్ల తర్వాత, 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ ను కొన్ని విషయాలు కలవరపెడుతున్నాయి.

Also Read : జూమ్ చేసి అసభ్యకరంగా చూపించొద్దు..!

ముఖ్యంగా.. భారత బ్యాటింగ్ లైనప్ ఆందోళన కలిగిస్తోంది. మొన్న సంజు సామ్సన్ ఆడకపోతే భారత్ ఓటమి పాలయ్యేది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఆందోళన కలిగిస్తున్నారు. బౌలింగ్ పరంగా కూడా భారత్ కు కొన్ని సమస్యలు ఉన్నాయి. మహ్మద్ సిరాజ్ ను వాడుకోవడం లేదనే విమర్శలు కూడా కొంత ఉన్నాయి. అర్షదీప్ సింగ్ పవర్ ప్లే లో ఫెయిల్ కావడం కూడా కంగారు పెట్టే అంశమే. ఇక సూర్యకుమార్ యాదవ్, శివం దూబే బ్యాటింగ్ పరంగా ఫెయిల్ కావడం కూడా కంగారు పెట్టే విషయమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అంగన్వాడీలు, ఆశావర్కర్ల సమస్యల...

అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలతో చర్చించేందుకు...

మరో దేశంపై ట్రంప్...

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం నిరంతరం...

స్వామి ఆశీస్సులతోనే కొత్త...

కొత్త పార్టీ ఏర్పాటుపై బీఆర్ఎస్ మాజీ...

పెళ్లిపై చంద్రబాబు కీలక...

దేశ వ్యాప్తంగా జనాభా తగ్గిపోవడంపై ఆందోళన...

బొత్సను పూర్తిగా పక్కన...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

సీఎంఓలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఓర్పు,...

పోల్స్