ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం గుజరాత్‍లోని అహ్మదాబాద్‌లో జరగనుంది. నరేంద్రమోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ – న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ దక్కించుకోవాలని కివీస్ జట్టు ఆరాటపడుతుంటే.. అభిమానుల మధ్య మరోసారి టీ20 టైటిల్ దక్కించుకోవాలని టీమిండియా ఊవ్విళ్ళూరుతోంది. రెండు జట్లు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై కివీస్ జట్టు అలవోకగా గెలవగా.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Also Read : దువ్వాడకు రూల్స్ తెలియదా..? మరో వివాదంలో మాధురి..!
భారత్ – న్యూజీలాండ్ జట్లు తలపడనున్న ఈ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కాక రేపుతోంది. ఇంకా చెప్పాలంటే.. టార్గెట్ వైసీపీ అధినేత అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అక్రమాస్తుల కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 నెలల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పాస్‌పోర్టు సీబీఐ కోర్టులో ఉంది. దీంతో ఆయన కుమార్తెను చూసేందుకు కూడా కోర్టు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి.
ఈ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ మధ్య కొలంబోలో జరిగిన మ్యాచ్‌కు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ తెల్లారి విజయవాడలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను రిసీవ్ చేసుకున్నారు. అదే రోజు రాత్రి ఢిల్లీలో ఎంపీలో సమావేశమయ్యారు. దీంతో “చినబాబు బాగా బిజీ” అంటూ వైసీపీ నేతలు తెగ ట్రోల్ చేశారు. ఈ విషయంపై జగన్ కూడా సెటైర్లు వేశారు. మ్యాచ్ చూడాలంటే స్టేడియంకే పోవాలా.. ఇంట్లో టీవీలో చూస్తే చాలదా.. నేను కూడా టీవీలోనే చూశా.. అన్నారు. దీనిపై అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు నా డబ్బులతో టికెట్ కొనుక్కుని మ్యాచ్ చూస్తే.. మీకేంటి.. అంటూ లోకేష్ కౌంటర్ వేశారు. ఇక జగన్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు.
Also Read : ఫేక్ పోస్ట్ లతో మోడీ పరువు తీస్తున్నారా..?
ఇలాంటి విషయాల మీద కాకుండా.. పనికొచ్చే విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది కదా అని వైసీపీ నేతలే జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అయితే టార్గెట్ జగన్ అన్నట్లుగా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. కొలంబో వెళ్లడానికి అయితే పాస్ పోర్టు కావాలి కాబట్టి పోలేదు.. అందుకే ఇంట్లోనే టీవీలో మ్యాచ్ చూశావు.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కదా.. కాబట్టి ఇబ్బంది లేదు.. అన్న వెళ్లొచ్చు.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు అయితే.. అన్నొస్తున్నాడు అంటే.. స్టేడియం మొత్తం ఖాళీ చేయాల్సిందే.. సింహం సింగిల్‌గానే మ్యాచ్ గెలిపిస్తుంది.. అంటున్నారు. ఇక టీడీపీ అభిమానులు అయితే మరో అడుగు ముందుకు వేశారు. జగన్ వస్తా అంటే.. లోకేష్ తన సొంత డబ్బుతో టికెట్ కొనిస్తాడు.. కూల్‌డ్రింక్ కూడా ఇప్పిస్తాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పాపం పార్టీ నడిపేందుకు కూడా జగన్ దగ్గర డబ్బులు లేవు కదా.. కాబట్టి దారి ఖర్చులు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టుకుంటుంది లే.. అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

