Saturday, June 20, 2026 11:03 PM
Saturday, June 20, 2026 11:03 PM

ఓట్స్ తింటే నిజంగానే బరువు తగ్గుతారా..?

ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఆహారంలో డైట్ తో పాటుగా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం నుంచి వ్యాయామం వరకు, నిద్ర నుంచి నడక వరకు ఎన్నో పాటిస్తూ ఉంటారు. ఇందులో ఆహారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గించే ప్రయోజనాల కోసం ప్రజల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆదరణ పొందిన ఆహారం ఓట్స్ అనే చెప్పాలి. ఓట్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.

Also Read : కొడాలి, వల్లభనేనికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..?

మరి అవి నిజంగా బరువు తగ్గిస్తాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓట్స్ పోషకమైన ఆహారం మాత్రమే కాదు, బరువు తగ్గడానికి ప్రభావవంతంగా చేసే అనేక లక్షణాలను కూడా కలిగి ఉంటాయనేది నిజమే. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అని పిలువబడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ వేగం తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండినట్టు ఉంటుంది. ఓట్స్ ఆకలిని, చిరుతిండి తినాలనే కోరికను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

Also Read : అమరావతి నిర్మాణ కూలీలలో మావోలు..?

బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఖచ్చితంగా కీలకమే. రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమయ్యే ఇతర ఆహారాల మాదిరిగా కాకుండా, ఓట్స్ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి, ఇది మీ ఎనర్జీ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి, మీ కోరికలను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓట్స్‌ లో సహజంగా కేలరీలు తక్కువగా ఉంటాయి.. కానీ మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జీవక్రియ, శక్తి ఉత్పత్తికి సహాయపడతాయి, శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించడానికి సహాయం చేస్తాయి. వ్యాయామం చేసేటప్పుడు శక్తి తగ్గకుండా ఉండటానికి ఓట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్