Wednesday, May 6, 2026 08:57 PM
Wednesday, May 6, 2026 08:57 PM

అందుకే ఫ్లాప్ అయింది.. హరిహర వీరమల్లుపై డైరెక్టర్ కామెంట్స్

దాదాపు నాలుగేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చిన ఈ సినిమాను గత వారం విడుదల చేయగా.. ఓపెనింగ్స్ బాగున్నా వీకెండ్ లో ఫెయిల్ అయింది. సినిమాలో ఆశించినంత ఏమీ లేదని, గ్రాఫిక్స్ అసలు బాలేదు అంటూ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఇది ఒకరకంగా మెగా ఫ్యామిలీకి కూడా షాక్ అనే చెప్పాలి.

Also Read : మరో పొలిటికల్ డ్రామా.. తెర పైకి కొత్త ఉద్యమం..!

ఇక సినిమా ఫ్లాప్ గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు కామెంట్ చేసారు. ప్రేక్షకులు సినిమాను సరిగా అర్ధం చేసుకోలేదని ఆయన అసహనం వ్యక్తం చేసారు. అందరూ సిజీఐ లేదా వీఎఫ్ఎక్స్ బాలేదు అంటున్నారు గాని కథ బాలేదని ఎవరూ చెప్పలేదని, నెగటివ్ పాయింట్ తీసుకుని ప్రచారం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్క్రీన్ ప్లే గురించి కూడా ఎవరూ కంప్లైంట్ చేయలేదన్నారు. కొన్ని షాట్లు అనుకున్న స్థాయిలో లేవని తనకు తెలుసునని కామెంట్ చేసారు. రివ్యూస్ తో సినిమాను ఇబ్బంది పెట్టారన్నారు.

Also Read : ట్రంప్ సంచలన ప్రకటన.. పాకిస్తాన్ తో కీలక ఒప్పందం

రివ్యూస్ చదివి సినిమాకు వెళ్ళడం కామెడిగా ఉందన్నారు. ఈ సినిమాకు తొలి రోజు 35 కోట్లు రాగా.. రెండవ రోజు కేవలం 8 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అటు పవన్ ఫ్యాన్స్ కు కూడా సినిమా నచ్చకపోవడంతో.. లాంగ్ రన్ కనపడలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్