Saturday, September 19, 2026 02:27 PM
Saturday, September 19, 2026 02:27 PM

కేటీఆర్ కు మైనస్.. లోకేష్ కు ప్లస్ అదే

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. వాస్తవానికి మహానాడులోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందని భావించారు. అయితే పలు కారణాలతో దీనిపై పార్టీ అధిష్టానం ముందుకు వెళ్లలేదు. పార్టీ నేతలు అందరూ ఈ విషయంలో ఏకతాటి మీదకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజకీయ పార్టీల్లో సీనియర్ నాయకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది.

Also Read : అవును.. ఆ ఇద్దరికి వాళ్లే సమస్య..!

ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు సీనియర్ నేతల నుంచి డిమాండ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే లోకేష్ విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా జరిగింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది. తెలంగాణలో 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను అప్పట్లో కెసిఆర్ ఎంపిక చేశారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలామంది కెసిఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Also Read : కోవర్టులు.. వలస పక్షులు.. బీ కేర్ ఫుల్..!

2018 ఎన్నికల తర్వాత తెలంగాణ లో మళ్లీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగా అప్పట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయన చేపట్టే.. అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ సీనియర్ నేతల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేసీఆర్ ఈ నిర్ణయంలో ముందుకు వెళ్లలేకపోయారు. కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా కేసీఆర్ సాహసం చేయలేదు. చాలామంది సీనియర్ నేతలు ఈ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ విషయంలో మాత్రం టిడిపిలో అందరూ ఏకతాటి మీద ఉండటం.. వర్గాలు లేకపోవడం కలిసి వచ్చే అంశంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్