Wednesday, May 6, 2026 11:41 PM
Wednesday, May 6, 2026 11:41 PM

అక్కడ పవార్ ఫ్యామిలీ ఇక్కడ రావు ఫ్యామిలి.. బీజేపీ ప్లాన్ వర్కౌట్..?

తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. పార్టీలో కంటే కల్వకుంట్ల కుటుంబంలో వచ్చిన చీలిక ఆందోళన కలిగిస్తుంది. కవిత ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాక.. పార్టీ కార్యకర్తలు కంగారుపడుతున్నారు. 2010 తర్వాత పార్టీలో ఆమె ఉత్సాహంగా పనిచేశారు. 2014లో ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.ఇక 2024 ఎన్నికలకు ముందు లిక్కర్ కుంభకోణం కవితను బాగా ఇబ్బంది పెట్టింది.

Also Read : పాకిస్తాన్ బహిరంగ సభలో పహల్గాం ఉగ్రవాది సంచలన కామెంట్స్

అయితే ఇప్పుడు కవిత.. బిజెపికి దగ్గర కాబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. సాధారణంగా బిజెపి ఇటువంటి రాజకీయాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబంలో ఏ విధంగా అయితే… చీలిక తీసుకువచ్చిందో.. ఇప్పుడు అలాగే కల్వకుంట్ల కుటుంబంలో తీసుకువచ్చింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో జెండా పాతాలని బీజేపీ ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ తరుణంలోనే కవితకు గాలం వేసినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : మద్దతు ప్లీజ్.. హస్తినకు జగననన్న

లిక్కర్ కుంభకోణంతోపాటుగా పలు అంశాల్లో కవితకు కేంద్రం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. అందుకే కవితను అడ్డం పెట్టుకొని భారత రాష్ట్ర సమితిని దెబ్బ కొట్టాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బిజెపి కొన్ని జిల్లాల్లో మాత్రమే కాస్తో కూస్తో బలంగా కనబడుతోంది. కవిత పార్టీ మారితే ఖచ్చితంగా తమకు ఫలితం ఉంటుందని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఆమెకు కీలక పదవి ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నట్లు రాజకీయ వర్గాల అభిప్రాయపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్