Wednesday, May 6, 2026 10:48 PM
Wednesday, May 6, 2026 10:48 PM

ఏపీ అసెంబ్లీలో ధూళిపాళ్ళ మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై కూటమి సర్కార్ ఆసక్తికర విషయాలు బయటపెడుతోంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న కొన్ని అవినీతి వ్యవహారాలను ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు బయటపెడుతున్నారు. ఇటీవల సహకార బ్యాంకుల్లో రుణాల వవహారాన్ని బయట పెట్టిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.. తాజాగా మరో అంశాన్ని సభలో లేవనెత్తారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్కుల కొనుగోళ్లల్లో గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణంపై అసెంబ్లీలో ప్రస్తావించారు.

Also Read : రాజకీయ అనాధలకు బిజెపి ఆశ్రయం

మొత్తం 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్కుల కొనుగోళ్లల్లోని అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ధూళిపాళ్ళ నరేంద్ర ప్రశ్నించారు. రెండు విడతల్లో మొబైల్ వెటర్నరీ క్లినిక్కులను కొనుగోలు చేస్తే.. మొదటి, రెండో విడతల ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి, రెండో విడతల్లోనే ప్రతి మొబైల్ యూనిట్టుకు రూ. 14 లక్షలు వ్యత్యాసం ఉందన్న ధూళిపాళ్ళ. పొరుగు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలకే మొబైల్ యూనిట్లు కొనుగోళ్లు చేస్తే.. ఏపీలో గత ప్రభుత్వెలో రూ. 82 లక్షలకు కొనుగోలు చేశారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసారు.

Also Read : రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రైళ్లు సికింద్రాబాద్ కు రావు..!

ఆపరేటింగ్ కాస్ట్ పేరుతో భారీ ఎత్తున దోపిడీకి గత ప్రభుత్వం తెర లేపిందని ధూళిపాళ్ళ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల కుమ్మక్కుతోనే నాటి ప్రభుత్వ పెద్దలు భారీ దోపిడీకి తెర లేపారన్న ధూళిపాళ్ళ.. ఆర్కేవీవై నిధులను దారి మళ్లించి మొబైల్ యూనిట్లను కొనుగోళ్లు చేశారన్న అంశం పైనా విచారణకు డిమాండ్ చేసారు. ఇక మిర్చి యార్డ్ లో జరిగిన కొన్ని అక్రమాలపై కూడా ఆయన నేడు సభలో ప్రస్తావించారు. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడికి కుట్ర జరిగింది గుంటూరు మిర్చి యార్డులోనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్