Wednesday, May 6, 2026 07:05 PM
Wednesday, May 6, 2026 07:05 PM

ఈరోజు (12-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం 12-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 12-11-2025

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

—————————————

వృషభం 12-11-2025

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

మిధునం 12-11-2025

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

కర్కాటకం 12-11-2025

అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరు ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలను కొంత బాధిస్తాయి.

—————————————

సింహం 12-11-2025

మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

—————————————

కన్య 12-11-2025

మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

—————————————

తుల 12-11-2025

ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

—————————————

వృశ్చికం 12-11-2025

వృత్తి వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.

—————————————

ధనస్సు 12-11-2025

ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి.

—————————————

మకరం 12-11-2025

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

—————————————

కుంభం 12-11-2025

ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిని. స్వల్ప అనారోగ్య సమస్యను ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.

—————————————

మీనం 12-11-2025

సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

నిజంగా కేసీఆర్ కు...

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష...

పోల్స్