Monday, August 3, 2026 11:26 AM
Monday, August 3, 2026 11:26 AM

ఈరోజు రాశి ఫలితాలు (28-02-2026)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం 28-02-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

—————————————

వృషభం

కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది.

—————————————

మిధునం

అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.

—————————————

కర్కాటకం

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు.

—————————————

సింహం

చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

—————————————

కన్య

తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

—————————————

తుల

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది.

—————————————

వృశ్చికం

వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

—————————————

ధనస్సు

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

—————————————

మకరం

దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.

—————————————

కుంభం

ఋణ భారం పెరిగి నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.

—————————————

మీనం

ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్