Thursday, February 12, 2026 06:36 AM
Thursday, February 12, 2026 06:36 AM

ఈరోజు (12-02-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బహుళ పక్షం 12-02-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

—————————————

వృషభం

ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ లబ్ది పొందుతారు.

—————————————

మిధునం

బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

—————————————

కర్కాటకం

దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

—————————————

సింహం

పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

—————————————

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

—————————————

తుల

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

—————————————

ధనస్సు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

—————————————

మకరం

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

—————————————

కుంభం

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.

—————————————

మీనం

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

మ్యాచ్ అంటే ఇది.....

టి20 వరల్డ్ కప్ లో చిన్న...

ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.....

ఏపీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది....

జగన్ కు చెన్నకేశవ...

రాజకీయాల్లో వైఎస్ జగన్ ది విలక్షణ...

స్పీకర్ సంచలన నిర్ణయం..?...

ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలు...

పదవుల ఆరాటమే.. విమర్శలు...

2014 నుంచి 2019 వరకు ఏపీలో...

పోల్స్