పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న నియంత పోరాటానికి ఇరాన్ నుంచి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హర్మోజ్ జలసంధి సొంతం చేసుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఇదే సమయంలో అమెరికా సైన్యానికి తీవ్రస్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణకు బ్రేకులు పడ్డాయి. దీంతో గల్ఫ్ దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఇప్పుడు ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఆయా దేశాలు అప్రకటిత లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.
Also Read : మాట, మర్యాద గురించి పేర్ని నోట నీతి మాటలు..!
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతోంది. భారత్‌లో సైతం ఇప్పటికే ఎల్‌పీజీ కొరత తీవ్రస్థాయిలో ఉంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించింది. గ్యాస్ కష్టాల కారణంగా ఇప్పటికే చిన్న హోటళ్లు దాదాపు మూత పడ్డాయి. ఇక ఇంధన కొరత అంటూ ఇప్పటికే చాలా చోట్ల పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు ముందుగానే లీటర్ల కొద్ది పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు కూడా. ఇదే సమయంలో లాక్ డౌన్ అనే పుకార్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేశారు. లాక్ డౌన్ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అయితే ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరతను అధిగమించేందుకు పొరుగు దేశం బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ను సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కార్యాలయాల్లో పనిగంటలను సైతం ఓ గంట తగ్గించింది. ఇక మీదట సాయంత్రం ఐదు గంటలకు బదులు 4 గంటలకే అన్ని కార్యాలయాలూ మూత పడనున్నాయి. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ముందుగానే వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్రకటిత లాక్‌డౌన్ ప్రకటించినట్లు అయ్యిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ‘మేం ముగ్గురం’.. షాకిచ్చిన రష్మిక..!
ఇటు ప్రపంచంపై ఆధిపత్యం చలాయించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు బడ్జెట్‌లో రక్షణ శాఖకు భారీ ఎత్తున కేటాయింపులు చేసింది ట్రంప్ సర్కార్. అమెరికా రక్షణ శాఖ.. పెంటగాన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో 1.5 ట్రిలియన్ డాలర్లు.. సుమారు రూ.139 లక్షల కోట్ల భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ప్రపంచ భద్రతా సవాళ్లు, ఆయుధ నిల్వల పునర్నిర్మాణం కోసం ఈ వ్యయాన్ని 40 శాతం పైగా పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఇది గతంలో ఉన్న సుమారు 1 ట్రిలియన్ డాలర్ల అంచనా కంటే చాలా ఎక్కువ.
అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ బడ్జెట్. ఇదే సమయంలో దేశ సైన్యాధిపతి పదవి నుంచి జనరల్ ర్యాండీ జార్జ్‌ను తొలగిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

