Sunday, September 20, 2026 01:06 AM
Sunday, September 20, 2026 01:06 AM

పల్నాడు జిల్లాపై కేంద్రం స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. గత ఐదేళ్లుగా అభివృద్ధి విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పలు కీలక ప్రాజెక్టులు నిలిచిపోగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించి ముఖ్యంగా జాతీయ రహదారుల ద్వారా మౌలిక సదుపాయాలను కల్పించాలని సంకల్పించింది. గ్రామ స్థాయి రోడ్ల నిర్మాణాలపై చంద్రబాబునాయుడు సర్కార్ ఫోకస్ పెడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండటంతో ఏపీలో పలు జాతీయ రహదారులకు మోక్షం లభిస్తుంది.

Also Read : టీడీపీ లీగల్ సెల్ నిజంగానే బలహీనమా..?

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిపిపి విధానంలో రోడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్ల వరకు జాతీయ రహదారి 167 ఏడి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా గురజాల, రెంటచింతల మాచర్లలో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ ల నుంచి వెళ్లే రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం 54.9 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మొత్తం 13.16 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.

Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు

ఒక్క కిలోమీటర్ కు 4.1 కోట్లు కేటాయించారు. పల్నాడు జిల్లాలోని గురజాల, రెంటచింతల మాచర్ల లోని బైపాస్ రోడ్ల నిర్మాణం ఇందులో భాగంగా చేపడతారు. ఆయా పట్టణాల నుంచి వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిధులు ఇవ్వడంతో త్వరలోనే టెండర్లను పిలిచి పనులను మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే దాచేపల్లి నుంచి మాచర్ల వెళ్లడం సులువుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనితో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పే అవకాశాలున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్