Saturday, February 14, 2026 02:03 PM
Saturday, February 14, 2026 02:03 PM

అధినేతపై గుర్రుగా క్యాడర్.. అసలున్నాడా..!

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా..? ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారా..? ఇకపై ఆయన కనిపించరేమో..?.. ఇప్పుడు ఈ ప్రశ్నలే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించే అనేది అందరికీ అర్థమవుతోంది. తెలంగాణ జాతిపిత అని గొప్పగా చెప్పుకునే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నారు. అసలు తమ సారు.. ఎక్కడున్నారనే విషయం తమకే తెలియదన్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల పరిస్థితి.

Also Read : కేటీఆర్‌కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టిన కవిత..!

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. రెండు సార్లు వరుసగా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక తనకు తెలంగాణలో తిరుగే లేదని భావించిన కేసీఆర్.. పార్టీ పగ్గాలను తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించారు. కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేశారు. రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందంటే.. ఏకంగా 3 నెలల పాటు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. సీఎంగా ఉన్న కేసీఆర్, హోమ్ మంత్రిగా మహ్మద్ మహమూద్ అలీని మాత్రమే నియమించి.. పరిపాలన మొత్తం తన కనుసన్నల్లో ఉండేలా చూసుకున్నారు. ఇక అధికారంలో ఉన్నంత కాలం.. సచివాలయం ముఖం కూడా చూడలేదు. పరిపాలన అంతా తన క్యాంప్ ఆఫీసు నుంచే చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా అని గొప్పగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా జాతీయ స్థాయి నేతలతో సమావేశాలు, పక్క రాష్ట్రాల్లో పర్యటనలతో కొద్ది రోజుల పాటు హంగామా చేశారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కారు టైరు పంచర్ అయినట్లుగా కేసీఆర్ పరిస్థితి మారిపోయింది. బాత్ రూమ్‌లో కాలు జారి పడిపోవవడంతో 6 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. అధికారిక నివాసం ఖాళీ చేసి నందినగర్ మీదుగా ఫామ్ హౌజ్‌కు మకాం మార్చేశారు. 2024 జనవరి నుంచి కేసీఆర్‌ను కలవాలంటే ఫామ్ హౌజ్‌కు మాత్రమే వెళ్లాలి. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినప్పటికీ.. పది స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా గట్టి పోటీ ఇవ్వలేదు. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో పరువు పోయినట్లు భావించిన కేసీఆర్.. కాలు బయటపెట్టడం మానేశారు.

Also Read : పురపోరులో గురిపెట్టి కొట్టిన రేవంత్..!

అడపాదడపా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వస్తున్న కేసీఆర్.. కార్యకర్తలను ఉత్సాహ పరిచేందుకు ఒకటి, రెండు భారీ డైలాగులు వేసి.. మళ్లీ ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోతున్నారు. ఓ వైపు అన్న చెల్లెళ్ల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకున్నా కూడా.. తండ్రిగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయలేదు. అసెంబ్లీకి రావటమే మానేసిన కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కానీ, మునిసిపల్ ఎన్నికల్లో కానీ.. తమ పార్టీ అభ్యర్థుల పట్ల కనీసం ప్రచారం చేయలేదు. చివరికి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ వీడియో బైట్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో కేసీఆర్‌కు అరెస్టు భయం పట్టుకుందనే మాట బాగా వినిపిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలను మీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. సార్ వస్తారు.. తప్పకుండా వస్తారు.. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ తప్పకుండా గెలుస్తుంది.. అని చెబుతున్నారు తప్ప.. సార్ ఎప్పుడు వస్తారు.. అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ బడ్జెట్ విశేషాలు.....

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

‘–40’ మార్కులతో వైద్య...

ఒకప్పుడు వైద్యుడు కావడం అంటే అత్యంత...

కేటీఆర్‌కు దిమ్మ తిరిగే...

టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు అన్నట్లుగా...

పోల్స్