Thursday, May 7, 2026 06:43 AM
Thursday, May 7, 2026 06:43 AM

కేటిఆర్ కు ఒకే రోజు రెండు షాక్ లు…!

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఇప్పట్లో వదిలేలా కనబడటం లేదు. ఒకేరోజు ఆయనకు రెండు షాక్ లు తగిలాయి. ఈరోజు ఉదయం హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఈడి జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నేడు కేటీఆర్ ను విచారించాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని కేటిఆర్ తెలిపారు.

Also Read : ఏపి కేబినేట్ లో భారీ మార్పులు ఖాయం..?

మీరు ఏసీబీ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు… కాబట్టి హైకోర్టులో విచారణ జరిగే వరకు వేచి చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఇక నేడు ఉదయం తెలంగాణ హైకోర్టు దానిపై కీలక నిర్ణయం తీసుకోవడంతో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఈనెల 16న విచారణ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఈడీ నుంచి నోటీసులందాయి. ఎఫ్ యు కు కట్టబెట్టిన 55 కోట్ల వ్యవహారం పై ఈడీ విచారణ చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.

Also Read : వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై కేటీఆర్ ను ఈడి అధికారులు ప్రశ్నిస్తారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ ను ఈడి నమోదు చేసింది. వారం క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా హైకోర్టు వ్యవహారం తేలిపోవడంతో మరోసారి నోటీసులు పంపించింది. ఇక కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా ఏసీబీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక మరోసారి ఆయన ఈనెల 9న విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. దీనితో ఆయనను అరెస్టు చేయడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయడంతో కేటీఆర్ అరెస్టు దాదాపు ఖాయంగా కనపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్