Wednesday, August 5, 2026 01:54 PM
Wednesday, August 5, 2026 01:54 PM

రేవంత్ పేరు కావాలనే మర్చిపోతున్నారా…?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న పరిణామాలు కాస్త ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి పేరుని పలువురు మర్చిపోవడం పట్ల పెద్ద చర్చ జరుగుతుంది. మొన్నామధ్య అల్లు అర్జున్… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వివాదం అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో పేరు మరిచిపోయాడు కాబట్టే రేవంత్ రెడ్డి పోలీసులతో అరెస్టు చేయించారు అంటూ ప్రచారం జరిగింది. ఇక తాజాగా తెలుగు మహాసభల్లో కూడా ఇలాంటి పరిణామమే ఒకటి ఎదురయింది.

Also Read : అసలు ఏం జరుగుతుంది.. లోకేష్‌ ఫైర్‌..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా ఉన్నారు. యాంకర్ కిరణ్ కుమార్ రెడ్డి అంటూ పలకడం పట్ల సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా దీనిపై భవనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే ముందు అన్ని సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకుంటారని… ముఖ్యమైన విషయాలు మర్చిపోకుండా పేపర్ మీద కూడా రాసుకోవాలని… తాను ఎక్కడికి వెళ్లినా అదే పని చేస్తానని చెప్పారు.

Also Read : కేసీఆర్ ఇక రానట్టే.. క్లారిటీ ఇచ్చేసారు..!

ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఏ విధంగా మర్చిపోతారని నిలదీశారు. అలాగే ఎవడయ్యా… ఆ తెలుగు మహాసభలు పెట్టింది..? తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా ముఖ్యమంత్రి తెలవని వారు యాంకర్ అవుతారా..? యాంకరింగ్ చేసే వ్యక్తికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలియదా..? అసలా యాంకర్ కు తెలుగు వచ్చా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారని.. దీని వెనక ఏదో కుట్ర జరుగుతుంది అంటూ చామాల కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

పోల్స్