ఈరోజుల్లో తప్పుడు ప్రచారాలకు ఉన్న ప్రాధాన్యత వాస్తవాలకు ఉండదు అనే మాట అక్షర సత్యం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఈ విమానాశ్రయం క్రెడిట్ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడలేని ఎలివేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విమానాశ్రయం చరిత్ర ఒకసారి చూస్తే.. తెలంగాణకు శంషాబాద్ విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అదే స్థాయిలో విమానాశ్రయం ఉండాలని 2015లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు భావించి విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు వేశారు.
Also Read : గురు శిష్యుల మధ్య జల రగడ.. చంద్రబాబు స్పందిస్తారా..?
విశాఖపట్నంను ఏపీ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా విశాఖ సమీపంలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 జూన్ లో రైట్స్ సంస్థ ద్వారా విమానాశ్రయానికి సంబంధించిన సాంకేతిక ఆర్థిక సాధ్యసాధ్యాల నివేదికను సిద్ధం చేశారు. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వివిధ బిడ్డర్లతో.. రెండుసార్లు ప్రీ బిడ్ సమావేశాలు కూడా జరిగాయి. 2017 మార్చ్ లో ప్రాజెక్ట్ అమలను పర్యవేక్షించేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 2018 జూన్ లో ఎయిర్పోర్ట్ తో పాటుగా ఏరోట్రోపోలీస్, ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ఎంఆర్ఓ సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ గా నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలిచారు.
Also Read : క్యాలెండర్ ఇయర్ లో 2 వేల కోట్లు.. స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డ్..!
2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ సమయానికి 2502 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఆ తర్వాత వైసిపి అధికారం చేపట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి అనేక అడ్డంకులు సృష్టించి.. పనులను జరగకుండా ఇబ్బంది పెట్టింది. మళ్లీ జగన్ పనుల కోసం శంకుస్థాపన చేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ ప్రతిపక్ష నేత హోదాలో.. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి విమానాశ్రయం ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకి వెళ్లి భోగాపురం విమానాశ్రయాన్ని ఆపేద్దామని కూడా జగన్ బహిరంగంగా ప్రకటించారు అప్పట్లో. వైజాగ్ విమానాశ్రయంలోనే మధ్యాహ్నం సమయంలో ఈగల తోలుకుంటున్నారని ఇంకా కొత్త విమానాశ్రయం ఎందుకని జగన్ అప్పట్లో చేసిన కామెంట్ పై తీవ్ర దుమారం రేగింది. ఇక ఈ విమానాశ్రయం నిర్మాణం అనేది దిక్కుమాలిన ఆలోచన అంటూ జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారంటూ కూడా జగన్ విమర్శలు చేయడం.. మళ్లీ జగన్ రెండోసారి శంకుస్థాపన చేసినప్పుడు అదే సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించడం కూడా జరిగాయి. ఈ వాస్తవాలు అన్ని రికార్డుల్లో ఉన్నప్పటికీ వైసీపీ మాత్రం ఈ విమానాశ్రయం క్రెడిట్ జగన్ కు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.

