Sunday, October 18, 2026 03:05 PM
Sunday, October 18, 2026 03:05 PM

జగన్ పొదిలి టూర్.. పోలీస్ మార్క్ విచారణ..!

ఏపీలో వైఎస్ జగన్ పర్యటనలు అనగానే ఏ సంఘటన జరుగుతుందా అనే ఆందోళన జనాల్లో మొదలైంది. జగన పర్యటనకు వస్తున్న ఆయన పార్టీ కార్యకర్తలు చేస్తున్న హడావుడి కూడా అంతా ఇంతా కాదు. రాజకీయంగా బలహీనంగా ఉండటంతో.. టీడీపీ నేతలను, పోలీసులను భయపెట్టే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ జగన్ అండ్ గ్యాంగ్ ఓ రేంజ్ లో హడావుడి సృష్టిస్తోంది. రైతులకు మద్దతుగా అంటూ జగన్ చేస్తున్న పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి.

Also Read : టీడీపీ, వైసీపీ మధ్య సెక్యూరిటీ వార్..!

ఇటీవల పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పర్యటనకు వెళ్ళారు. ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ఆయన చేసిన పర్యటనలో వైసీపీ కార్యకర్తలు ఓ రేంజ్ లో అలజడి సృష్టించారు. దీనిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా పోలీసులు ఇద్దరు వైసీపీ యువ నాయకులను అరెస్ట్ చేసారు. గట్టిగా విచారణ చేస్తున్న పోలీసు యంత్రాంగం.. వారి అలజడి వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై కూపీ లాగుతోంది. పొదిలి జగన్ పర్యటన సందర్భంలో ఘర్షణకు దిగిన జరిగిన పరిణామాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

Also Read : మేము మళ్లీ అధికారంలోకి వస్తే..!

ఎవడైనారని తొక్కిపడేస్తామంటూ ఫ్లెక్సీలతో నినాదాలు చేపట్టిన యువ వైసీపీ నాయకులు సంగటి ఇసాక్, వేసిపోగు రాజేష్ లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పొదిలి పోలీసులు. ఈ ఘర్షణలకు పాల్పడిన వాళ్లు ఎవరు ఉన్నారంటూ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ఇద్దరినీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరినీ వెలిగండ్ల మండలం బొంతల గుంట్ల గ్రామంలో గుర్తించిన పోలీసులు.. అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనలో భాగంగా ఎవరైతే ఘర్షణ దిగారో ప్రతి ఒక్కరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్